Iran-US Mediation: పాక్‌పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్‌నే నమ్ముతున్న రష్యా
- అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిగా భారత్..
- బ్రిక్స్ సమావేశంలో రష్యా మంత్రి కీలక ప్రతిపాదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran-US Mediation: న్యూఢిల్లీ వేదికగా బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రష్య విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలలో భారతదేశం ఒక ‘‘ధీర్ఘకాలిక మధ్యవర్తి’’ పాత్ర పోషించగలదని రష్యా విదేశాంగ మంత్రి అన్నారు. ప్రస్తుతం, ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పోషిస్తోంది. అయితే, పాకిస్తాన్ చేసిన మధ్యవర్తిత్వం ఫలితాలను ఇవ్వలేదు. పాక్ అమెరికా ప్రతిపాదనల్ని తమ ముందు పెడుతోందని, తమ ప్రతిపాదనల్ని పట్టించుకోవడం లేదని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా ప్రతిపాదన కీలకంగా మారింది.
‘‘సమస్యలను పరిష్కరించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ ప్రస్తుతం సహాయం చేయవచ్చు. అయితే దీర్ఘకాలిక మధ్యవర్తి అవసరమైతే సుదీర్ఘ దౌత్య అనుభవం ఉన్న భారత్ ఆ పాత్ర పోషించగలదు’’ అని రష్యా మంత్రి అన్నారు. అయితే, లావ్రోవ్ చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్‌కు చికాకు తెప్పించవచ్చు. పాక్ మధ్యవర్తిత్వంపై ఇజ్రాయిల్, యూఏఈ, ఇరాన్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇటీవల పాక్ మధ్యవర్తిత్వాన్ని తాము విశ్వసించడం లేదని అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం అన్నారు.
Also Read
- Bhojshala Case: "భోజ్‌శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- Monsoon 2026: గుడ్‌న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bhojshala case: "భోజ్‌శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
అమెరికా, ఇజ్రాయిల్ దాడుల నుంచి ఇరాన్ తన సైనిక విమానాలను రక్షించుకోవడానికి పాక్ సహాయం చేసిందని, పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లో ఇరాన్ విమానాలు ఉంచడానికి అనుమతించిందని అమెరికన్ మీడియా పేర్కొంది. ఇదే సమయంలో భారత్‌కు అటు అమెరికా, ఇటు ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతోనే రష్యా ఈ ప్రతిపాదన చేసి ఉంటుంది.
తాజావార్తలు
-
Iran-US Mediation: పాక్‌పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్‌నే నమ్ముతున్న రష్యా
-
Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
-
Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
-
Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్‌ను దాటిన డాలర్ విలువ!
-
Durandhar 2 Review: ఓటీటీలోకి ‘ధురంధర్: ద రివెంజ్’.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!