NTV Telugu Site icon

Maharashtra CM: అజిత్ పవార్ సపోర్టుతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌

Maha

Maha

Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు రెడీ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది..? ఓ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సీఎం పదవి కోసం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్‌ షిండే ఇద్దరూ గట్టిగా పోటీ పడుతున్నారు. దీంతో ఎవరు సీఎం పీఠాన్ని దక్కించుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Read Also: IND vs AUS: విజయానికి అతి చేరువలో భారత్.. మరో రెండు వికెట్లు అంతే

కాగా, ఈ క్రమంలోనే మహారాష్ట్ర నెక్ట్స్ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌కే అజిత్‌ పవార్‌ సపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఆదివారం జరిగిన భేటీలో ఫడ్నవీస్‌ను సీఎం చేసేందుకు అజిత్‌తో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక, ఇటీవలే జరిగిన ఎన్నికల్లో 288 సీట్లకు మహాయుతి కూటమి 235 స్ఠానాల్లో గ్రాండ్ విక్టరీ సాధించింది. అందులో బీజేపీ 132 సీట్లతో ప్రధాన పార్టీగా నిలిచింది. అయితే, అధికారం చేపట్టడానికి 145 మ్యాజిక్‌ ఫిగర్‌.. బీజేపీ దానికి చాలా దగ్గరగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. కాగా, సీఎంగా ఏక్ నాథ్ షిండేనే కొనసాగించాలని భారతీయ జనతా పార్టీలోని కొందరు నేతలు వాదిస్తున్నారు. ఈ సస్పెన్స్‌కు 24 గంటల్లో తెరపడే ఛాన్స్ ఉంది.

Read Also: Maharashtra PCC: మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా

అయితే, మరోవైపు నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని శివసేన (షిండే) వర్గానికి చెందిన మంత్రి దీపక్‌ కేసర్కర్‌ ప్రకటించారు. తొలి విడుతలో సీఎంతో పాటు 21 మంది మంత్రులతో సర్కార్ కొలువుదీరనున్నదని సమాచారం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం సీఎం మినహా మరో 43 మందికి మంత్రివర్గంలో అవకాశం కల్పించవచ్చు. ఇందులో భారతీయ జనతా పార్టీ నుంచి 21, శివసేన (షిండే) నుంచి 12, ఎన్సీపీ (అజిత్‌) పార్టీ నుంచి 10 మందికి మంత్రులుగా ఛాన్స్ లభించవచ్చని తెలుస్తుంది.