Nashik TCS Case: నిదా ఖాన్‌కు షాక్.. కోర్టులో కీలక పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nashik TCS Case: మహారాష్ట్రలో సంచలనం రేపుతున్న నాసిక్ టీసీఎస్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్‌కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాసిక్ సెషన్స్ కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేస్తూ, అన్ని పక్షాలు తమ లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) నాసిక్ కార్యాలయానికి సంబంధించిన లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ఆరోపణల కేసులో నిదా ఖాన్ పేరు ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆమె కోర్టును ఆశ్రయించగా, తక్షణ ఉపశమనం కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
Read Also: New Airport: ఏపీ ప్రజలకు శుభవార్త.. 5000 ఎకరాల్లో అతి పెద్ద ఎయిర్ పోర్ట్..
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
విచారణ సందర్భంగా ప్రభుత్వం, దర్యాప్తు అధికారి తమ వాదనలు వినిపించారు. బాధితురాలి తరఫు న్యాయవాది కూడా తమ లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు సమయం కోరగా, కోర్టు ఆ అభ్యర్థనను ఆమోదించింది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాతే మధ్యంతర బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, కంపెనీ కూడా నిదా ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. ఏప్రిల్ 9, 2026 తేదీతో జారీ చేసిన ఉత్తర్వుల్లో, ఆమెను తక్షణమే సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. నిదా ఖాన్ డిసెంబర్ 27, 2021 నుంచి ప్రాసెస్ అసోసియేట్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ ఆమెకు ఉన్న నెట్‌వర్క్ యాక్సెస్‌ను రద్దు చేయడంతో పాటు, కంపెనీకి చెందిన ఆస్తులను తిరిగి అప్పగించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కార్యాలయానికి రావడం, ఇంటి నుంచి పనిచేయడం రెండింటినీ నిషేధించింది. కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఇతర ఉద్యోగులతో పంచుకుంటే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ఇక, ప్రస్తుతం నిదా ఖాన్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఆమె కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత, ఆమె ఆచూకీపై కొన్ని కీలక వివరాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా Maharashtra State Commission for Women ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వరుసగా మూడో రోజు కూడా విచారణ కొనసాగిస్తోంది. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ముఠా పనిచేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు ఒక పురుష ఉద్యోగి ఫిర్యాదుతో సహా మొత్తం తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు సమాచారం. మొత్తానికి, నిదా ఖాన్‌కు కోర్టులో ఉపశమనం లభించకపోవడం, కంపెనీ సస్పెన్షన్ చర్యలు, పోలీసుల గాలింపు కలిపి ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ఏప్రిల్ 27న జరిగే తదుపరి విచారణపై అందరి దృష్టి నెలకొంది.
తాజావార్తలు
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..