Nag Ashwin: ‘డిజైన్ బాగాలేదు, మార్చేయండి’ అంటూ రైల్వే మినిస్టర్‌కి సలహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల, తిరుపతి పుణ్యక్షేత్రాల్ని దర్శించుకోవడం కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఎలా తరలి వస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. భక్తులు ఇలా పోటెత్తుతుండడం వల్లే తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడూ రద్దీగానే ఉంటోంది. అలాంటి రద్దీని తట్టుకునేలా రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆల్రెడీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కాంట్రాక్టు కూడా ఇచ్చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన కొత్త స్టేషన్ డిజైన్ ఫోటోల్ని సైతం కేంద్రమంత్రి షేర్ చేశారు.
అయితే.. ఈ కొత్త డిజైన్‌పై చాలామంది నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. భారత సంస్కృతికి ఏమాత్రం దగ్గరగా లేని ఈ డిజైన్ని వెంటనే మార్చాల్సిందిగా కోరుతున్నారు. బహుశా సౌకర్యాలు ఉన్నతంగా ఉండొచ్చేమో గానీ, డిజైన్ మాత్రం పుణ్యక్షేత్రాన్ని ప్రతిబింబించేలా లేదని, ఏదో సాదా సీదా భవనంలా ఉందంటూ పేర్కొంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. అది ఓ ఐటీ భవనంలా ఉందని, డిజైన్‌పై పునరాలోచించాలని కోరుతున్నారు. ఈ అభిప్రాయాలపై కేంద్రమంత్రి నుంచి గానీ, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి గానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో.. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ రంగంలోకి దిగాడు. డిజైన్ ఏమాత్రం బాగాలేదని, దాన్ని వెంటనే మార్చమంటూ తనదైన శైలిలో సలహా ఇచ్చాడు.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
‘‘డియర్ సర్.. మీ ట్వీట్ కిందున్న కామెంట్లను ఓసారి చూశారంటే, ఈ కొత్త డిజైన్ ఎవ్వరికీ నచ్చలేదని మీకు స్పష్టమవుతుంది. ఇదేదో ఐటీ పార్క్ డిజైన్లా, వెస్ట్రన్ నుంచి కాపీ కొట్టినట్టు ఉంది. తిరుపతి అనేది ఓ దైవ చింతన ఉన్న ప్రదేశం. ఇండియన్ ఆర్కిటెక్ట్ మీద పట్టున్న వారితో డిజైన్ చేయించండి. అంతేగానీ ఇలా గ్లాసులతో, స్టీల్ కాపీలతో కాదు’’ అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Dear sir…as u might have seen in the comments…nobody likes this…The design looks like some generic western copy, some bad IT park… tirupati is sacred, spiritual…lets get ppl to design it who understand the rich architecture of India..and not this glass n steel copies🙏
— Nag Ashwin (@nagashwin7) May 31, 2022
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!