BJP election campaign song: “నాటు నాటు” సాంగ్ “మోడీ మోడీ”గా మారింది.. కర్ణాటకలో వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Naatu Naatu’ becomes ‘Modi Modi’ in BJP election song: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉంది. ఇప్పటికే ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది. మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే మరోసారి రాష్ట్ర బీజేపీ ప్రధాని నరేంద్రమోదీ ఛరిష్మానే నమ్ముకుంది. ఆయన కేంద్రంగానే ప్రచారం జరగుతోంది. ఇటీవల కాలంలో ప్రధాని పలుమార్లు కర్ణాటకను సందర్శించారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.
Read Also: Karnataka Elections: బీజేపీకి ఈశ్వరప్ప షాక్.. పోటీ చేయనని నడ్డాకు లేఖ
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
ఇదిలా ఉంటే కర్ణాటక బీజేపీ ప్రస్తుతం ‘‘నాటు నాటు’’ సాంగ్ తో అదరగొడుతోంది. ట్రిపుల్ ఆర్ నుంచి ఆస్కార్ గెలుచుకున్న నాటు నాటు పాటను రీమిక్స్ చేసి ‘‘మోడీ మోడీ’’గా విడుదల చేసింది. బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో చేసి అభివృద్ధి పనులను వివరిస్తూ ఈ పాట కొనసాగింది. కన్నడ ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ ఏ మార్గాన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా నాటునాటు సాంగ్ తో ప్రజల దృష్టిని ఆకట్టుకోవాలని చూస్తోంది. బీజేపీ మంగళవారం ఈ సాంగ్ ను విడుదల చేసింది.
https://twitter.com/mla_sudhakar/status/1645697648085827584
ఈ పాటలో గత మూడేళ్లలో రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వంలో శివమొగ్గ విమానాశ్రయం, బెంగళూరు – మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే, మెట్రో లైన్‌లు మరియు ఇతర సంక్షేమ పథకాలని ప్రస్తావించారు. కర్ణాకట ఆరోగ్యమంత్రి కే సుధాకర్ వీడియోను చేశారు చేస్తూ..‘‘ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మా డబుల్ ఇంజిన్ సర్కార్ కర్ణాటకలో అభివృద్ధి పండుగను అద్భుతమైన పాట ద్వారా ప్రజల ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తుందని, అందరకు బీజేవైఎంకు ప్రశంసలు’’అంటూ ట్వీట్ చేశారు. గతంలో 2009 ఎన్నికల ముందు స్లమ్ డాగా మిలియనీర్ లోని ‘జై హో’ సాంగ్ ను రీమిక్స్ చేసి ‘జై హో కాంగ్రెస్’ అంటూ రీమిక్స్ చేసింది. మే 10న కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 224 నియోజక వర్గాలకు జరగనున్న పోరులో బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ పోటీ చేయనున్నాయి.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!