ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అనేక విషయాలు రాబట్టారు. ఇక కుట్ర వెనుక ఎవరున్నది అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇక టెర్రర్ మాడ్యూల్ ప్రకారం అల్-ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన ఉగ్ర డాక్టర్ల బృందం కుట్ర పన్నినట్లుగా తేలింది. జైషే ఉగ్ర సంస్థ ఆదేశాలతో దేశ వ్యాప్త పేలుళ్లకు ప్రణాళికలు రచించినట్లుగా దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి.
ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: రాజీనామా తర్వాత తొలిసారి పబ్లిక్‌గా ప్రసంగించిన మాజీ ఉపరాష్ట్రపతి
ఇప్పటికే డాక్టర్లు షాహీనా, ముజమ్మిల్‌తో పాటు దేశ వ్యాప్తంగా అనేక చోట్ల నుంచి పలువురు అనుమానితులును అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ముజమ్మిల్ ఇంట్లో పెద్ద ఎత్తున 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్ దొరికింది. అలాగే షాహీనా దేశ వ్యాప్తంగా పేలుళ్లు ఎలా జరపాలన్నదానిపై ప్రణాళికలు రచించినట్లుగా అధికారులు కనిపెట్టారు.
ఇది కూడా చదవండి: Machado: నోబెల్ శాంతి గ్రహీతకు కొత్త చిక్కులు.. అవార్డ్‌పై వెనిజులా అభ్యంతరం
ఇదిలా ఉంటే ముజమ్మిల్‌ను విచారించగా అనేక కీలక విషయాలను రాబట్టినట్లుగా తెలుస్తోంది. దేశ వ్యాప్త పేలుళ్లకు కుట్ర పన్నినట్లుగా ముజమ్మిల్ నేరాన్ని అంగీకరించినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. 2023లోనే ఈ ప్రణాళిక వేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.