MP News:మధ్యప్రదేశ రాజధాని భోపాల్‌లో ముస్లిం వ్యక్తిపై దాడి ఘటన వైరల్‌గా మారింది. జిల్లా కోర్టు వద్ద ఈ దాడి జరగడం గమనార్హం. హిందూ మతానికి చెందిన మహిళను పెళ్లి చేసుకునేందుకు వచ్చిన సమయంలో హిందూ గ్రూపు ఈ దాడికి పాల్పడింది. వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు అతడిని కొడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.