Bengal: వెనక్కి తగ్గని సస్పెన్షన్ ముస్లిం ఎమ్మెల్యే.. బాబ్రీ మసీదు శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు
- పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు
- వెనక్కి తగ్గని సస్పెన్షన్ ముస్లిం ఎమ్మెల్యే
- బాబ్రీ మసీదు శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు
- భారీగా మోహరించిన కేంద్ర, రాష్ట్ర బలగాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు తరహాలో మసీదు నిర్మించాలంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందు కబీర్ ప్రతిపాదన పెట్టాడు. అందుకు మమతా బెనర్జీ ససేమిరా అన్నారు. అయినా దూకుడుగా వ్యవహరించడంతో పార్టీ నుంచి కబీర్‌ను మమత సస్పెండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Indigo: తీవ్రస్థాయిలో ‘ఇండిగో సంక్షోభం’.. వెక్కి.. వెక్కి ఏడుస్తున్న ప్రయాణికులు
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
అయినా కూడా తగ్గేదేలే అంటూ హుమాయున్ కబీర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. శనివారం
మూడు లక్షల మందితో ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు శంకుస్థాపనకు పూనుకున్నారు. ఇందుకోసం కబీర్ భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
అయితే ఈ కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు కోల్‌కతా హైకోర్టు కూడా నిరాకరించింది. శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలని తెలిపింది. దీంతో బెల్దంగా స్థలాన్ని హై-సెక్యూరిటీ గ్రిడ్‌లో ఉంచారు. జాతీయ రహదారి -12కి ఇరువైపులా రాష్ట్ర, కేంద్ర బలగాలు మోహరించాయి. ప్రస్తుతం 3,000 మంది సిబ్బంది మోహరించినట్లుగా ఒక సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Indigo: ఇండిగో సిబ్బందిపై విదేశీ మహిళ ఆగ్రహావేశాలు.. వీడియో వైరల్
ఇక ఈ వ్యవహారంపై గవర్నర్ సీవీ.ఆనంద బోస్ స్పందించారు. రెచ్చగొట్టే ప్రకటనలు, పుకార్లతో మోసపోవద్దని ప్రజలను కోరారు. ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
ఇదిలా ఉంటే బాబ్రీ మసీదు శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. అరబ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రత్యేక అతిథులు వస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున భోజన ఏర్పాట్లు, సభ కోసం పెద్ద ఎత్తున స్టేజ్ ఏర్పాటు చేసినట్లుగా సమాచారం.
- Tags
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!