Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

Watermelon Case

Watermelon Case

Watermelon Case: పుచ్చకాయ తిని ముంబైకి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా వాటర్‌మిలన్ కొనుగోళ్లను ప్రభావితం చేశాయి. ముంబైలోని ఫ్రూట్ మార్కెట్‌లో ఒక్కసారిగా పుచ్చకాయ రేట్లు పడిపోయాయి. ఈ ఘటన అంతగా జనాలను భయపెట్టింది.

అయితే, ఈ కేసు సంచలనంగా మారడంతో ఫోరెన్సిక్ పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విషప్రయోగం వల్ల వారు మరణించారని నిర్ధారించింది. మృతుల శరీరాల్లో, వారు తిన్న పుచ్చకాయలో ఎలుకల్ని చంపడానికి ఉపయోగించే ఒక విష పదార్థం ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. వారి శరీర అంతర్గత అవయవాలలో ఆకుపచ్చ రంగు కనిపించింది. దీంతో విష ప్రయోగం జరిగినట్లు నివేదిక వెల్లడించడంతో ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

Read Also: Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

45 ఏళ్ల అబ్దుల్లా డొకాడియా, అతని భార్య 35 ఏళ్ల నస్రీన్, వారి పిల్లలు 13 ఏళ్ల జైనాబ్, 16 ఏళ్ల అయేషాలు ముంబైలోని తమ ఇంట్లో బంధువులకు విందు ఇచ్చారు. మటన్ పులావ్ వడ్డించారు. బంధువులు వెళ్ళిపోయిన కొన్ని గంటల తర్వాత, తెల్లవారుజామున 1 గంటకు ఆ కుటుంబం పుచ్చకాయ తిన్నారు. ఉదయం 5 గంటలకల్లా, వారందరికీ తీవ్రమైన వాంతులు, విరేచనాలు అయ్యి, కొన్ని గంటల్లోనే మరణించారు.

ఈ కేసులో పుచ్చకాయలోకి విషం కావాలని ఎవరైనా ఎక్కించారా? లేక ప్రమాదవశాత్తు ఈ విషం దాంట్లోకి చేరిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో మృతుల మెదడు, గుండె, పేగులతో సహా కొన్ని అవయవాలు ఆకుపచ్చగా మారాయి. ఈ కేసులో విందులో పులావ్ తిన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.