Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
- వ్యక్తిగత విమర్శలే ఉద్రిక్తతలకు కారణం
- భౌతిక దాడులు పిరికిపంద చర్యలే: పొన్నం
- కార్యకర్తలను అదుపులో పెట్టాలన్న మంత్రి
- ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, అయితే అవి హుందాతనాన్ని కోల్పోకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇటీవల కొంతమంది నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం వల్లే సమాజంలో అశాంతి నెలకొంటోందని, ఇటువంటి ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నాయకులు తమ స్థాయిని మర్చిపోయి వ్యక్తిగత దూషణలకు దిగడం వల్లే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. “ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరించాలి. చౌకబారు ప్రచారం కోసం దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదు. ఒకరి మాటల వల్ల ఎవరి మనసైనా నొచ్చుకుంటే, దానికి దీటుగా సమాధానం చెప్పాలే తప్ప, భౌతిక దాడులకు దిగడం పిరికిపంద చర్య” అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ప్రజాప్రతినిధుల ఇళ్లపై మరో ప్రజాప్రతినిధికి చెందిన కార్యకర్తలు దాడులు చేయడం అప్రజాస్వామికమని మంత్రి పేర్కొన్నారు. నాయకులు ఎవరైనా సరే తమ కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. “దాడులకు పాల్పడుతున్న కార్యకర్తలపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఆయా నాయకులకు ప్రజాస్వామ్యంపై ఉన్న చిత్తశుద్ధి నిరూపించబడుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రతినిధులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, ప్రజల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా హితవు పలికారు. రాజకీయాలు కేవలం అధికార దాహం కోసం కాకుండా, ప్రజా సేవ కోసం ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!