MP Priti Patel: ‘‘పాకిస్తాన్‌పై దాడి చేసే హక్కు భారత్‌కి ఉంది’’.. బ్రిటీష్ ఎంపీ మద్దతు..
- భారత్‌కి మద్దతుగా బ్రిటీష్ ఎంపీ..
- యూకే పార్లమెంట్లో భారత చర్యని సమర్థించిన ప్రీతి పటేల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Priti Patel: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడిలో 100 మంది వరకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత చర్యని పలు దేశాలు సమర్థిస్తున్నాయి. తాజాగా, బ్రిటీష్ ఎంపీ ప్రీతి పటేల్ భారత్‌కి మద్దతు ప్రకటించారు. భారతదేశంతో కలిసి ఉగ్రవాద నిరోధక సహకారాన్ని బలోపేతం చేయాలని యూఎస్ హౌజ్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడారు. పాకిస్తాన్ నుంచి సరిహద్దు ఉగ్రవాద ముప్పుని గుర్తించాలని యూకేని కోరారు.
‘‘ ఏప్రిల్ 22న ఉగ్రవాదులు పహల్గామ్ లో 26 మంది పర్యాటకుల్ని క్రూరంగా హత్య చేశారు. ఇది అనాగరికమైన, క్రూరమైన హింసాత్మక చర్య. చాలా మంది బాధితులను తలపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో తలపై కాల్చి చంపారు. ఈ ఘటనతో ప్రభావితమైన వారితో నా ఆలోచనలు, ప్రార్థనలు ఉన్నాయి’’ అని ఆమె అన్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలంటూనే, పాక్ ఆధారిత ఉగ్రవాద గ్రూపుల నుంచి ఎదుర్కొంటున్న ముప్పుని యూకే గుర్తించాలని ప్రతీ పటేల్ అన్నారు.
Also Read
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
- Mallikarjun Kharge: లోక్‌సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
- MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
- Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
Read Also: Operation Sindoor: ‘‘ఎవరైనా భారత్ వ్యతిరేక ప్రచారం చేశారో..’’ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు..
‘‘పహల్గామ్ ఉగ్రవాద దాడికి కారణమైన, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే సహేతుకమై చర్యలు తీసుకునే హక్కు భారత్‌కి ఉంది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు భారత్ దేశం, పాశ్చాత్య ప్రయోజనాలను బెదిరిస్తారని మాకు తెలుసు’’ అని ఆమె అన్నారు.
ఒసామా బిన్ లాడెన్ దాక్కున్న దేశం, భారత్‌పై సుదీర్ఘకాలం నుంచి ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తున్న చరిత్ర కలిగిన దేశం అని పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మిత్ర దేశాలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆమె యూకే పార్లమెంట్లో చెప్పింది.
కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత యూకే భారతదేశానిక ఏదైనా నిర్దిష్ట భద్రతా సహాయం అందించిందా..? ఉద్రిక్తతల్ని నివారించేందుకు బ్రిటన్ నిర్దిష్ట మద్దతు అందించగలదా..? అని ఆమె అడిగారు. పహల్గామ్ దాడికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌తో లష్కరేతోయిబా సంబంధాలు, ఇటీవల వారితో హమాస్ నేతలు సమావేశమైన నివేదికల్ని ప్రీతి పటేల్ చర్చించారు.
Today in the House of Commons I reiterated my condolences for those impacted by the atrocity that took place in Pahalgam. We must stand with those affected by terrorism. The UK must work with our friends in India to tackle terrorist threats and engage with India, Pakistan and key… pic.twitter.com/8RXezaJHx0
— Priti Patel MP (@pritipatel) May 7, 2025
తాజావార్తలు
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!