Indigo: సిక్ లీవ్ పేరుతో ఉద్యోగులంతా ఇంటర్వ్యూలకి.. విమాన రాకపోకలు ఆలస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగోకు సంబంధించిన విమానాలు శనివారం పెద్ద సంఖ్యలో ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. ఆ సంస్థకు చెందిన 55 శాతం మంది సిక్‌లీవ్‌లో వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు చాలా వరకు సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. శనివారం ఒక్కరోజే దాదాపు 900 సర్వీసులపై ఈ ప్రభావం పడినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించిది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీజీసీఏ.. ఇండిగో ఎయిర్‌లైన్స్ నుంచి వివరణ కోరింది. అయితే, సిక్‌లీవ్ పెట్టిన సిబ్బంది అంతా ఎయిర్ ఇండియా నిర్వహిస్తోన్న ఉద్యోగ నియామకాల ఇంటర్వ్యూల కోసం వెళ్లినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఇండిగో సంస్థ నిత్యం దాదాపు 1600 దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను నడిపిస్తోంది. ఇందులో శనివారం చాలా సర్వీసులు నడవలేదు. ఆదివారం కూడా ఇదే విధమైన సమస్య తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ స్పందించారు. ఈ పరిణామంపై దృష్టి సారించామని అన్నారు. అయితే, దీనిపై ఇండిగో మాత్రం స్పందించలేదు.
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
Tomato Prices: మొన్నటివరకూ భారీ ధర…ఇప్పుడేమో నేలచూపులు
ఎయిర్ ఇండియాను ఈ ఏడాది జనవరి 27న కేంద్రం.. టాటా గ్రూప్‌కు తిరిగి అప్పగించింది. గతేడాది అక్టోబర్ 8న వేసిన బిడ్డింగ్‌లో గెలిచి విమానయాన సంస్థ నిర్వహణ, నియంత్రణను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది టాటా గ్రూప్. ఈ నేపథ్యంలోనే కొత్త విమానాలను కొనుగోలు చేసి సేవల్ని మెరుగుపర్చుకోవాలని చూస్తున్న ఎయిర్ ఇండియా ఇటీవలే రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. ఈ ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిలో చాలా మంది సిక్ లీవ్‌లో ఉండటం, ఎయిరిండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ హాజరు కావడానికి వెళ్లడంతో ఈ పరిస్థితి తలెత్తిందని తెలిసింది. టాటా గ్రూప్ సొంతమైన ఎయిరిండియాలో ఫేస్ 2 రిక్రూట్‌మెంట్ డ్రైవ్ శనివారం నిర్వహించారు. చాలా మంది క్యాబిన్ క్రూ మెంబర్లు సిక్ లీవ్ పెట్టి, ఎయిరిండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొనేందుకు వెళ్లారని అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!