Teenage pregnancy: ఆందోళకరంగా, టీనేజ్ అమ్మాయిల్లో పెరుగుతున్న ప్రెగ్నెన్సీలు..
- టీనేజ్ అమ్మాయిల్లో పెరుగుతున్న ప్రెగ్నెన్సీలు..
- కర్ణాటక నివేదికలో వెల్లడి..
- సోషల్ మీడియా, ఇంటర్నెట్, అవగాహన లేకపోవడం కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teenage pregnancy: ఇటీవల కాలంలో టీనేజ్ అమ్మాయిల్లో ప్రెగ్రెన్సీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కర్నాటకలో 2021-22 నుంచి 2023-24 వరకు ఏకంగా 33,621 టీనేజ్ అమ్మాయిలు గర్భం దాల్చినట్లు ఒక నివేదిక వెల్లడించింది. సామాజిక ఆర్థిక అంశాలతో పాటు ఇంటర్నెట్ ప్రభావం, కుటుంబ అస్థిరత ఈ ధోరణికి కారణమని నిపుణులు చెబుతున్నారు. గత దశాబ్దకాలంలో ఇలాంటి విస్తృత ధోరణి ఇటీవల కాలంలోనే కనిపిస్తోంది.
జిల్లాల వారీగా చూసుకుంటే.. బెంగళూరు అర్బన్‌లో అత్యధికంగా 4,324 టీనేజ్ గర్భాలు నమోదయ్యాయి. విజయనగర్ (2,468 కేసులు), బళ్లారి (2,283), బెలగావి (2,224), మరియు మైసూరు (1,930) జిల్లాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. సామాజిక పరిస్థితులు, సోషల మీడియా, ఇంటర్నెట్ వినియోగం, సమగ్రమైన లైంగిక విద్య లేకపోవడం కూడా ఈ పరిస్థితులకు కారణమని నివేదిక వెల్లడించింది.
Also Read
Read Also: Swati Maliwal: హీటెక్కిన ఢిల్లీ పాలిటిక్స్.. కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేసి స్వాతి మాలివాల్ నిరసన
కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ నాగన్న గౌడ మాట్లాడుతూ.. టీనేజర్లు అనుచితమైన కంటెంట్‌కి గురికావడంలో సోషల్ మీడియా పాత్రను నొక్కి చెప్పారు. ఇది వారి జీవిత ప్రారంభంలోనే ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తోందని చెప్పారు. ‘‘టీనేజర్లు తరుచుగా ఆన్‌లైన్‌లో చూసే వాటి ద్వారా ప్రభావితమవుతారు. హఠాత్తు నిర్ణయాలు వారి సంబంధాలకు దారితీస్తున్నాయి. ఇది ఊహించని విధంగా గర్భాలకు దారితీస్తోంది’’ అని అన్నారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. వార్షిక టీనేజ్ గర్భధారణ కేసుల్ని సూచించింది. 2021-22లో 11,792 కేసులు ఉండగా, 2022-23లో అది 13,198కి పెరిగింది, ఆ తర్వాత 2023-24లో 8,631కి తగ్గింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఎన్జీవోలు, ఇతర సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
తాజావార్తలు
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!