Parliament Monsoon Session: పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా.. వెంకయ్యకు ఘన వీడ్కోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే నాలుగు రోజుల ముందే ముగిశాయి. పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఆగస్టు 12న సమావేశాలు ముగియాల్సి ఉన్నప్పటికీ.. అంతకన్నా ముందే ఈ రోజే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. చివరి రోజున ఆర్బిట్రేషన్ బిల్లు, ఇంధన బిల్లు లోక్‌సభ ఆమోదం పొందాయి. రాజ్యసభ ఆమోదంతో గతిశక్తి బిల్లు పార్లమెంటు గడప దాటింది. ఈనెల 10న పదవీ విరమణ చేయనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఎంపీలందరూ పార్టీలకు అతీతంగా ఘన వీడ్కోలు పలికారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర ముఖ్య నేతలు హాజరైన సభలో వీడ్కోలు పలికారు. నాయుడు బుధవారం పదవీ విరమణ చేయనుండగా.. ఆయన వారసుడు జగదీప్ ధన్‌కర్ ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వర్షాకాల సమావేశాలు అనేక కీలక ఘట్టాలకు వేదికయ్యాయి. నూతన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఈ సమావేశాల్లోనే సభ్యులు ఎన్నుకున్నారు. ధరల పెరుగుదల, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం వంటి అంశాలపై విపక్షాల నిరసనలతో.. ఉభయసభలు హోరెత్తాయి. ధరల పెరుగుదలపై ఉభయ సభల్లో స్వల్ప కాలిక చర్చ జరిపింది ప్రభుత్వం. కొన్ని కీలక బిల్లులు ఆమోదింపచేసుకుంది.
Venkaiah Naidu: రాజ్యసభ ఛైర్మన్ హోదాలో వెంకయ్యనాయుడు భావోద్వేగ ప్రసంగం
Also Read
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
రాజ్యసభలో 16 రోజులు సిట్టింగ్స్ జరిగాయని, ఆ సమయంలో 38 గంటల పాటు కార్యక్రమాలు నిర్వహించినట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వెల్లడించారు. కానీ విపక్షాల ఆందోళన వల్ల 48 గంటల సభా సమయం వృథా అయినట్లు వెంకయ్య చెప్పారు. ఈ సారి కేవలం 5 ప్రభుత్వ బిల్లులు మాత్రమే సభ ఆమోదం పొందినట్లు ఆయన చెప్పారు. 27 ప్రైవేటు మెంబర్స్ బిల్లులను ప్రవేశపెట్టినా.. కేవలం ఆరోగ్య హక్కు బిల్లు గురించి మాత్రమే చర్చ జరిగినట్లు వెంకయ్య తెలిపారు. లోక్‌సభ సమావేశాలను కూడా నాలుగు రోజులు ముందుగానే వాయిదా వేశారు. 44 గంటల 29 నిమిషాల పాటు సభా కార్యక్రమాలు జరిగినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
తాజావార్తలు
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!