Monkeypox: ఇండియాలో మరో మంకీపాక్స్ కేసు.. ట్రావెల్ హిస్టరీ లేని వ్యక్తిలో వైరస్ గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాను మంకీపాక్స్ కేసులు కలవరానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా.. తాజాగా నాలుగో కేసు నమోదు అయింది. శనివారం వరకు నమోదు అయిన మంకీపాక్స్ కేసులు కేరళ రాష్ట్రంలో వెలుగు చూడగా.. నాలుగో కేసు దేశ రాజధాని ఢిల్లీలో బయటపడింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. కేరళలో నమోదు అయిన మూడు కేసుల్లో బాధితులు ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చారు. అయితే ఢిల్లీలో నమోదైన నాలుగో కేసులో బాధితుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఎలాంటి ప్రయాణాలు చేయకుండానే సదురు బాధితుడికి మంకీపాక్స్ వైరస్ సోకింది. ప్రస్తుతం 31 ఏళ్ల బాధితుడు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో చేరినట్లు మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. బాధితుడు జ్వరం, చర్మంపై దద్దుర్లతో ఆస్పత్రిలో చేరాడు.
Read Also: Monkeypox: ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
Also Read
- NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్‌షీట్
- Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
- Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో 16 వేలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో ఎక్కువగా యూరోపియన్ దేశాల్లోనే నమోదు అయ్యాయి. అక్కడే 86 శాతం కేసులు ఉన్నాయి. మరో 11 శాతం కేసులు యూఎస్ఏలో నమోదు అయ్యాయి. తాజాగా శనివారం ప్రపంచ ఆరోగ్యసంస్థ ( డబ్ల్యూహెచ్ఓ) మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లర్ చేసింది.
కేరళలో జూలై 14న తొలి మంకీపాక్స్ కేసు నమోదు అయింది. ఆ తరువాత దుబాయ్ నుంచి కన్నూర్‌కు వచ్చిన 31 ఏళ్ల వ్యక్తికి జులై 18న కేరళ రెండోసారి మంకీపాక్స్ ను గుర్తించారు. జూలై 22న కేరళలో మూడో కేసు బయటపడగా.. జూలై 24న ఢిల్లీలో నాలుగో కేసు వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Medigadda Case : మేడిగడ్డ కేసులో మరో ట్విస్ట్.. కేసీఆర్‌కు మళ్లీ సమన్లు..!
-
NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్‌షీట్
-
Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు విజయవంతంగా పూర్తయిన సర్జరీ
-
Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..