Naga Shaurya: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో యంగ్ హీరో నాగశౌర్య ఒకడు. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ హీరో విజయాపజయాలను లెక్కచేయకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక తాజాగా నాగశౌర్య నటించిన చిత్రం కృష్ణ వ్రింద విహారి. ఈ సినిమా రేపు రిలీజ్ కు సిద్ధమవుతోంది. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై హీరో నాగశౌర్య మదర్ ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో నాగశౌర్య తన పెళ్లిపై ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఎప్పుడు మీడియా ముందుకు వెళ్లినా ఈ కుర్రహీరోకు పెళ్ళెప్పుడు..? అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంది.
ఇక ఈ సినిమాలో శౌర్య పెళ్లి తరువాత రొమాన్స్ ఉంటుంది అని చెప్పడంతో మరోసారి అతగాడి పెళ్లిపై వార్తలు గుప్పుమన్నాయి. పెళ్ళెప్పుడు అన్న ప్రశ్నకు శౌర్య ఇన్నాళ్లకు సమాధానం చెప్పేశాడు. “ఈ ఏడాది నా పెళ్లి ఉండొచ్చు.. తెలుగు వచ్చిన అమ్మాయే” అని హింట్ ఇచ్చాడు. ఇక ఇంకేముంది.. ఇక త్వరలోనే ఈ హీరో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో శౌర్య పెళ్లి కొడుకుగా మారబోతున్నాడు. తెలుగుమ్మాయి అని అంటే ఉషా ముల్పూరి తమ బంధువుల అమ్మాయిల్లో ఎవరినైనా సెలక్ట్ చేసి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ యంగ్ హీరో చేత తాళి కట్టించుకుంటున్న ఆ లక్కీ భామ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.