Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భవించి వందేళ్లు పూర్తైన సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు నష్టం కలిగించేలా భారత్ ప్రతి సారి ఓడిస్తునే ఉండాలని, అప్పుడు వారు శాశ్వతంగా పశ్చాత్తాపం చెందక తప్పదన్నారు. ఎల్లప్పుడూ మనం శాంతినే కోరుకోవడం మంచిది కాదు.. పాకిస్థానే మనతో శాంతి కావాలని కోరుకోవడం లేదు.. మనకు హాని చేయటంతోనే సంతృప్తి చెందుతుంది.. కాబట్టి, శాంతిని పాకిస్థాన్ ఉల్లంఘిస్తే అది ఎప్పటికీ విజయం సాధించలేదన్నారు. 1971లో పాక్ దండయాత్ర చేసి.. 90వేల మంది సైనికులను కోల్పోయినప్పటికీ.. ఇంకా బుద్ది రాలేదు.. అందుకే భారత్‌ను ఏమీ చేయలేమనే విషయం ఆ దేశానికి అర్థం అయ్యేలా దాడులు చేయాలన్నారు. పాక్ కుట్రలను ఎదుర్కొనేందుకు మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మోహన్ భగవత్ వెల్లడించారు.
Read Also: Cold Wave’s: తెలంగాణలో భారీగా పెరిగిన చలి.. ఆదిలాబాద్, హైదరాబాద్ లో.. !
అలాగే, ఆర్ఎస్ఎస్‌ను ఇప్పటి వరకు అధికారికంగా ఎందుకు రిజిస్టర్ చేయలేదని విపక్షాలు అడిగిన క్వశ్చన్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ స్పందిస్తూ.. హిందూ ధర్మం ఎక్కడా రిజిస్ట్రర్ కాలేదు.. మేం కూడా ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాగా, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ సంఘ్ ను గుర్తింపులేని సంస్థగా పేర్కొన్నాయి.. గుర్తింపే లేని సంస్థను గతంలో ఎలా నిషేధించారు? మా సంస్థ గుర్తింపు పొందింది అనడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి?.. 1925లో ఆర్ఎస్ఎస్‌ను స్థాపించినట్లుగా అప్పటి బ్రిటిష్ సర్కార్ తో అధికారికంగా రిజిస్ట్రర్ చేయించాలా? ఏంటి అని ప్రశ్నించారు. ఇక, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికారికంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను నమోదు చేసుకోవడాన్ని ఇండియన్ గవర్నమెంట్ తప్పనిసరి చేయలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఆదాయపు పన్ను శాఖ, కోర్టులు ఆర్ఎస్ఎస్‌ను వ్యక్తుల సంఘంగా మాత్రమే గుర్తించాయి. దానిలో భాగంగానే పన్నుల నుంచి మినహాయించాయని మోహన్ భగవత్ తెలియజేశారు.