కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ మహిళల కోసం ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూ వారి ఆర్థిక స్వాలంబనకు కృషి చేస్తుంది. తాజగా మహిళలకు మోడీ మరో శుభవార్తను చెప్పింది. స్వయం సంఘాల్లోని మహిళల ఆర్థిక స్థితి గతులను పెంచేందుకు మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ప్రతి ఏడాది రూ. లక్ష సంపాదించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికోసం ప్రత్యేకంగా ల్యాక్‌పతి ఎస్‌హెచ్‌జీ ఉమెన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వచ్చే రెండేళ్లలో 2.5 కోట్ల మంది గ్రామీణ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు జీవనోపాధిని కల్పించే దిశగా చర్యలు తీసుకుంటుంది. స్వయం సహాయక సంఘా ల్లోని మహిళల జీవన ప్రమాణాలు పెంచడానికి ఆర్థికపరమైన చేయూ తను అందిస్తామని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద ఇప్పటికే 7.7 కోట్ల మంది మహిళలు 70 లక్షలకుపైగా స్వయం సహాయక గ్రూపుల్లో భాగస్వాము లయ్యారని కేంద్రం తెలిపింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వడమే కాకుండా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంది.