దేశంలో చాలా మంది మొబైల్ ఫోన్లలో ఖచ్చితంగా డ్యూయల్ సిమ్‌ను వాడుతారు. అయితే కొందరూ మాత్రం 9,10 ఇంకా ఎక్కువ సిమ్‌లు వాడేవారు ఉన్నారు. కానీ ఇందులో ఎన్ని నెంబర్లు పనిచేస్తాయో లేదో తెలియదు. కొందరు టాక్‌టైమ్, టారీఫ్ ఆఫర్ల కోసం ఇష్టానుసారంగా సిమ్‌లు కొని వాటితో ఉపయోగం అయిపోగానే పడేస్తారు. మరికొందరు వాటిని అంతే అంటిపెట్టుకుని ఎప్పుడో ఒక్కసారి వాడుతుంటారు. ఇది సర్వసాధరణ విషయం.. అయినప్పటికీ దీనివల్ల సైబర్‌నేరగాళ్లు సైతం రెచ్చిపోతున్నారు. దీంతో ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి టెలి క్యూనికేషన్ల శాఖ(డాట్) కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఒక వినియోగదారుడి పేరు మీద 9 కన్నా ఎక్కువ సిమ్‌లు ఉంటే మళ్లీ వేరిఫికేషన్ చేయాల్సిందిగా డాట్ ఆదేశించింది.
పున:ధ్రువీకరణ జరగని పక్షంలో ఆ మొబైల్ కనెక్షన్ తొలగిస్తారు. వినియోగదారులు ఏ నెంబర్ ఉన్న సిమ్‌లు వాడుతారో తెలసుకుని, మిగతా కనెక్షన్‌లను డీయాక్టివేట్ చేయాల్సిందిగా డాట్ టెలికాం ఆపరేటర్లకు సూచించింది. ఆర్థిక నేరాలు, గుర్తు తెలియని కాల్స్, నేరాలను నిరోధించడానికి ఈ తాజా ఆదేశాలను జారీ చేసినట్టు డాట్ పేర్కొంది. మళ్లీ ధ్రువీకరణ చేయించుకోని అదనపు మొబైల్ కనెక్షన్లు డిసెంబర్ 7 నుంచి 60 రోజుల్లోగా రద్దు అవుతాయి. వినియోగదారులు ఆస్పత్రి, విదేశి పర్యటనలో ఉంటే మరో 30 రోజులు అదనపు సమయం ఇస్తారు.