Manipur Violence: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌కి సంబంధించిన ఖాళీగా ఉన్న ఇంటిని అల్లరిమూకలు టార్గెట్ చేశాయి. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో ఈ ఘటన జరిగింది. గత కొన్ని నెలల నుంచి మణిపూర్ అగ్నిగుండంగా ఉంది. మైయిటీ, కుకీ తెగల మధ్య జాతి ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 170కి పైగా మంది మరణించారు. రెండు రోజల క్రితం మైయిటీ వర్గానికి చెందిన ఇద్దర్ని మిలిటెంట్లు చంపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జూలై 6న మిస్సైన్ విద్యార్థులుగా గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ ని ఆంక్షలు విధించారు.
Read Also: Nitin Gadkari: 2023 చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు..
ఇద్దరు మైయిటీ విద్యార్థుల హత్యపై ఇంఫాల్ లోయలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి ఇంటిపైనే దాడి జరిగింది. ఇంఫాల్ శివార్లలో సీఎం బీరెన్ సింగ్ పూర్వీకులకు సంబంధించిన ఇళ్లు ఉంది. దీనిపై ఈ రోజు తెల్లవారుజామున గుంపుగా వచ్చిన ప్రజలు దాడికి ప్రయత్నించారు. ఇంఫాల్ లోయలో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఈ దాడి జరిగింది. దాడి సమయంలో భద్రతా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపి, గుంపును అడ్డుకుంది. ప్రస్తుతం సీఎం ఇంఫాల్ నగరం మధ్యలో ఒక ప్రత్యేక, సురక్షితమైన అధికార నివాసంలో ఉంటున్నారు.
ఇంఫాల్ లోని హీంగాంగ్ ప్రాంతంలో ముఖ్యమంత్రి పూర్వీకుల ఇంటిపై దాడికి యత్నించారు, భద్రతా బలగాలు గుంపును 100-150 మీటర్ల దూరంలో అడ్డుకున్నారని పోలీస్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ఇంటిలో ఎవరూ లేనప్పటికీ, 24 గంటల పాటు భద్రత ఉంటుంది. రెండు గ్రూపులుగా వచ్చిన అల్లరి మూకలు దాడికి యత్నించాయి. దాడికి యత్నించిన వారిని చెదరగొట్టేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులు అనేక రౌండ్లు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. కరెంట్ కనెక్షన్ తీసేసి, ఇంటి దగ్గర మరిన్ని బారికేడ్లను ఏర్పాటు చేశారు. అంతకుముందు బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు.