MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- విజయ్ రాజకీయ సునామీ కాదు, సినిమా సునామీ..
- డీఎంకే దయ వల్లే విజయ్ ప్రభుత్వం..
- త్వరలోనే డీఎంకే వైపు తమిళ ప్రజలు..
- మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్, కొత్తగా ఏర్పడిన సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయ్ సాధించిన విజయాన్ని రాజకీయ సునామీ కాదని, సినిమా సునామీ అని అభివర్ణించారు. కొన్ని రోజుల తర్వాత ప్రజల్లో ఈ ఉత్సాహం తగ్గి మళ్లీ డీఎంకే వైపు చూస్తారని అన్నారు. విజయ్ ప్రభుత్వం 5 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదని చెప్పారు. తమ అభిమాన నటుడు పార్రటీ ప్రారంభించడం వల్లే విజయ్‌కి ఓటేశారని చెప్పుకొచ్చారు. మెజారిటీ సాధించేందుకు అవసరమైన 118 సీట్లను విజయ్ గెలుచుకోలేకపోయాడని, డీఎంకే వల్లే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అన్నాడీఎంకేను విచ్ఛిన్నం చేయడానికి టీవీకే శాయశక్తులా ప్రయత్నించి విఫలమైందని వ్యాఖ్యానించారు. విజయ్ ప్రభుత్వం ఏ క్షణమైన కూలిపోయే ‘‘గోడ మీద పిల్లి’’ లాంటి ప్రభుత్వం అని అన్నారు. కమ్యూనిస్టులు, వీసీకే, ఐయూఎంఎల్ బయట నుంచి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెప్పి, ఇప్పుడు క్యాబినెట్లో భాగమయ్యారని అందుకు వారికి అభినందనలు అంటూ ఎద్దేవా చేశారు. ఒక బిడ్డ తన తల్లిని వెతుక్కున్నట్లే ప్రజలు త్వరలోనే తిరిగి డీఎంకే వైపు వస్తారని చెప్పారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నిరంతరం ఎదుగుదలకు కాంగ్రెస్ కారణమని నిందించారు. దేశవ్యాప్తంగా బీజేపీ సాధిస్తున్న విజయాలకు గతంలో నరేంద్రమోడీ, అమిత్ షా కారణమని తాను భావించానని, ఇప్పుడు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కనీస మర్యాద, కృతజ్ఞత లేవని, దానిని మళ్లీ ఎన్నటికీ నమ్మకూడదని ఉదయనిధి అన్నారు. ఇన్నాళ్లు తమ పార్టీ కాంగ్రెస్‌ను తన భుజాలపై మోసిందని, వారి విజయాలకు డీఎంకే పార్టీ కార్యకర్తలు సహకరించారని అన్నారు. కానీ కాంగ్రెస్ ఇప్పుడు టీవీకే ప్రభుత్వంలో భాగమైందని చెప్పారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!