Delhi Girl Murder: ఒక్క మిస్డ్ కాల్‌తో బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Girl Murder: ఢిల్లీలో ఇటీవల 11 ఏళ్ల బాలిక ఆచూకీ కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత హత్యకు గురై శవంగా దొరికింది. అయితే ఈ కేసును ఓ మిస్డ్ కాల్ ఆధారంగా పోలీసులు ఛేదించారు. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో బాలిక కనిపించకుండా పోయిన రోజున ఆమె తల్లికి తెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఉదయం 11.50 గంటలకు ఆమె తల్లికి మిస్డ్ కాల్ వచ్చింది, ఆమె తిరిగి కాల్ చేసినప్పుడు, నంబర్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ తరువాత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 12 రోజుల తర్వాత హత్యకు సంబంధించి రోహిత్ అలియాస్ వినోద్ అనే 21 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Kondagattu Temple: కొండగట్టు ఆలయంలో చోరీ.. బంగారు నగలతో పాటు విగ్రహాలు మాయం
Also Read
ఫిబ్రవరి 9న ఉదయం 7:30 గంటల ప్రాంతంలో తన కూతురు స్కూల్ బస్సులో వెళ్లిందని బాధితురాలి తల్లి తెలిపింది. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో తమ కుమార్తె కిడ్నాప్‌కు గురైందని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిబ్రవరి 10న కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
మిస్డ్ కాల్ ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు, మొబైల్ నంబర్ ను ట్రాక్ చేసి పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. ఫిబ్రవరి 21న నిందితుడి పట్టుకుని విచారించగా.. ఫిబ్రవరి 9న బాలికను హత్య చేసి శవాన్ని ఘోవ్రా మోర్ సమీపంలో పడేసినట్లు వెల్లడించారు. ముండ్కా గ్రామంలో కుళ్లిపోయిన స్థితిలో బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా నిందితుడు మృతదేహాన్ని పడేసిన చోటులో ఫోరెన్సిక్ టీం సాక్ష్యాలను సేకరించింది. నిందితుడిని రిమాండ్ నిమిత్తం జైలుకు పంపించారు. ఈ కేసులో హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బాలికపై లైంగిక వేధింపులు జరిగాయా..? అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తెలియనుంది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!