తమిళనాడులో ప్రస్తుతం నిరసన రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా అధికార పార్టీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. మొన్నటికి మొన్న ఓ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ రవి దగ్గర నుంచి డీఎంకే నేత భార్య జీన్ జోసెఫ్ డిగ్రీ పట్టా తీసుకునేందుకు నిరాకరించింది. వైస్ ఛాన్సలర్ దగ్గర తీసుకుని వెళ్లిపోయింది. గవర్నర్ తమిళ వ్యతిరేకి అని.. అందుకే పట్టా తీసుకోలేదని ఆమె తెలిపింది. తాజాగా బీజేపీ నేత అన్నామలైకు కూడా అదే మాదిరిగా చేదు అనుభవం ఎదురైంది. క్రీడా కార్యక్రమంలో పతకం మెడలో వేస్తుండగా ఓ మంత్రి కుమారుడు నిరాకరించాడు. ఈ పరిణామంతో ఒకింత అన్నామలై షాక్కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

రాష్ట్ర షూటింగ్ క్రీడలకు ముఖ్యఅతిథిగా అన్నామలై ఆహ్వానింపబడ్డారు. అనంతరం విజేతలకు మెడలో పతకాలు వేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా కుమారుడు సూర్య రాజ బాలు వంతు వచ్చింది. పతకం మెడలో వేస్తుండగా నిరాకరించాడు. చేతిలో తీసుకుని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అన్నామలై ఫొటో దిగి వెళ్లిపోయారు. గవర్నర్కు జరిగిన రెండు వారాలకే అన్నామలైకు ఇలాంటి అవమానం జరగడం చర్చనీయాంశమవుతోంది.
ఇది కూడా చదవండి: BJP: బీహార్ ఎన్నికల ముందే బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎంపిక.. కసరత్తు ప్రారంభం!
అయితే ఈ నిరసనను అన్నామలై ఖండించారు. ఇదొక దురదృష్టకర నాటకం అని అభివర్ణించారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లోకి రాజకీయాలు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: మాజీ ఉపరాష్ట్రపతి ధన్ఖర్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..! వెలుగులోకి సమాచారం