తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీహార్ పర్యటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. ఎన్నికల సంఘం.. అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
తమిళనాడులో ప్రస్తుతం నిరసన రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా అధికార పార్టీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. మొన్నటికి మొన్న ఓ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ రవి దగ్గర నుంచి డీఎంకే నేత భార్య జీన్ జోసెఫ్ డిగ్రీ పట్టా తీసుకునేందుకు నిరాకరించింది.