Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- జంతర్ మంతర్‌లో సీజేపీ నిరసనలకు మెహబూబా ముఫ్తీ మద్దతు.
- పేపర్ లీక్, అవినీతిపై ఉద్యమాన్ని ప్రశంసించిన పీడీపీ చీఫ్.
- "దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం" అని వ్యాఖ్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సీజేపీ ఉద్యమానికి సపోర్ట్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గురువారం ఆమె నిరసనకు మద్దతు తెలిపారు. పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరసనల్ని రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, యువత భవిష్యత్తును కాపాడే పోరాటంగా అభివర్ణించారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. తీవ్రమైన ఎండను తట్టుకుని నిరసనలు కొనసాగిస్తున్న విద్యార్థుల్ని అభినందించారు. ఈ ఉద్యమం అవినీతి, పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని ఇస్తుందని అన్నారు.
గత 12 ఏళ్లుగా దేశంలో విభజన రాజకీయాలు, అవినీతి, పేపర్ లీకులు, మహిళలపై నేరాలు పెరిగాయని ఆమె ఆరోపించారు. ఈ రోజు మన దేశంలో పిల్లల కన్నా ఆవులే ఎక్కువ సురక్షితంగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు న్యాయవ్యవస్థపై విమర్శలు చేశారు. ఇన్ని రోజులుగా విద్యార్థుల ఉద్యమం జరుగుతున్నా వారి సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, యువత ఆందోళనల్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ అహంకారం ఎక్కువ రోజులు నిలవదని, యువత శక్తి కన్నా గొప్ప శక్తి లేదని, రాజ్యాంగాన్ని కాపాడేది యువతే అని ఆమె అన్నారు.
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్‌కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్‌మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
తాజావార్తలు
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?