రాజా రఘువంశీ.. భార్య సోనమ్ చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. పెళ్లైన 10 రోజులకే హనీమూన్‌కు తీసుకెళ్లి అత్యంత కిరాతంగా హంతకుల చేత రాజాను చంపేసింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను.. కాళ్ల పారాని ఆరకముందే భూమ్మీద లేకుండా చేసేంది. మొదట్లో జంట మిస్ కాగానే అయ్యో.. పాపం అనుకున్నారు. ఇప్పుడు అసల విషయం తెలిసి మహిళా లోకమే నివ్వెరపోయింది. సోనమ్ దారుణాన్ని బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ సహా పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో పాటు మహిళా లోకం ధ్వజమెత్తుతోంది.
ఇది కూడా చదవండి: Sonam Raghuwanshi: రాజాను పెళ్లి చేసుకోను.. ప్రియుడితోనే ఉంటాను.. తల్లిని హెచ్చరించిన సోనమ్
రాజా రఘువంశీని పెళ్లి చేసుకునేందుకు సోనమ్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. తల్లిదండ్రులు బలవంతంగా రాజాతో పెళ్లి చేశారు. ముందే తల్లిని హెచ్చరించింది. పెళ్లయ్యాక రాజాను ఏం చేస్తానో ముందే బెదిరించింది. అన్నట్టుగానే సోనమ్.. అత్యంత దారుణంగా మేఘాలయలో చంపేసింది.
ఇది కూడా చదవండి: Sonam Raghuwanshi: భర్త హత్యకు రూ.20లక్షల డీల్.. స్వయంగా డెడ్‌బాడీని లోయలోకి తీసేసిన సోనమ్!
ఇక మే 23న లోయలోకి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ముందుగానే ఏర్పాటు చేసిన కిరాయి ముఠా వెంబడించింది. అయితే ఒక చోట సోనమ్ అలసిపోయినట్లుగా నటించింది. దీంతో రాజా కొంచెం నిర్జన ప్రదేశానికి వెళ్లిపోయాడు. కిరాయి ముఠా కూడా చాలా దూరంలో ఉన్నారు. వెంటనే రావాలని ప్రేరేపించింది. చంపేయాలని కోరింది. కానీ తాము అలసిపోయామని.. ఇప్పుడు కుదరదని చెప్పారు. దీంతో రూ.20లక్షల ఆఫర్ చేసింది. వెంటనే రాజాపై కిరాయి ముఠా దాడి చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని ముఠాతో పాటు సోనమ్ లోయలోకి తోసేసింది.
ఇక మే 23 నుంచి జంట జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. జూన్ 2న రాజా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడే కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కత్తి, మందులు, రక్తపుమరకులు ఉన్న రెయిన్ కోట్ దొరికాయి. కానీ రాజా మొబైల్ దొరకలేదు. అంతేకాకుండా సోనమ్ ఫోన్ కూడా లభించలేదు. రాజా ఫోన్‌లో చాట్‌లు, ఛాయాచిత్రాలు, కాల్ లాగ్‌లు ఉండవచ్చు. ఆ మొబైల్స్ దొరికితే మరింత సమాచారం లభించనుంది. రాజా మొబైల్‌ను సోనమ్ ఎక్కడైనా దాచేసిందా? లేదంటే లోయలోనే పడేసిందా? తెలియాల్సి ఉంది. అలాగే సోనమ్ మొబైల్‌పై కూడా క్లారిటీ రాలేదు. ఇద్దరి ఫోన్లు కోసం గాలిస్తున్నారు. బెంగళూరు టు మేఘాలయ వరకు ఏం జరిగిందో అందులోనే సమాచారం ఉండనుంది. వాటి కోసం గాలిస్తున్నారు. మరోసారి నిందితులతో క్రైమ్ సీన్ క్రియేట్ చేసేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.
ఇక నిందితులకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించారు. నిందితుల్లో ఒకరైన ఆకాష్‌కు చెందిన రక్తపు మరకలున్న చొక్కాలో రాజా రఘువంశీ రక్తం ఉందని ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా నిర్ధారించబడింది. అలాగు రక్తపు మరకలతో ఉన్న సోనమ్ రెయిన్ కోట్ ఇప్పుడు ఫోరెన్సిక్ విశ్లేషణలో ఉంది. అరెస్టు సమయంలో మరో నిందితుడు ఆనంద్ ధరించిన దుస్తులపై కూడా రక్తపు మరకలున్నాయి. ఇక రాజా వస్తువులపై నిందితుల వేలి ముద్రలు కూడా లభించాయి. ఇక నిందితులు ఉపయోగించిన ఫోన్లు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక 42 చోట్ల సీసీటీవీ ఫుటేజ్‌ను రికవరీ చేశారు. అలాగే రైలు టికెట్లు, లాడ్జీలో ఇచ్చిన ఆధార్ కార్డు వివరాలు కూడా సేకరించారు.
తొలుత నూతన జంట బెంగళూరుకు వచ్చారు. అక్కడ సోనమ్ నియమించుకున్న హంతక ముఠా కలిశారు. కిరాయి హంతకులు కూడా సోనమ్ నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన వారే. దీంతో ముఠా సభ్యులు.. కొత్త జంటతో ముచ్చటించారు. తెలిసిన వారు మాట్లాడుతున్నారని రాజా రఘువంశీ అనుమానించలేకపోయాడు. అక్కడ నుంచి నేరుగా ఈశాన్యానికి కనెక్టింగ్ విమానంలో జంట ప్రయాణించింది.
భర్తతో ఉండలేకే సోనమ్ హంతకులను నియమించుకుందని.. ప్రేమికుడితో కలిసి జీవించాలని డిసైడ్ అయిందని పోలీసులు తెలిపారు. పక్కా ప్లాన్‌తో వన్ వే టికెట్ ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఇక ప్రియుడు మేఘాలయకు రాకపోయినా సోనమ్ నిత్యం టచ్‌లోనే ఉందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక నిందితులు మే 21న గౌహతిలో జంటను వెంబడించారని.. జంట ఉన్న హోటల్‌లోనే బస చేశారని సీసీకెమెరాల్లో రికార్డైన దృశ్యాలను బట్టి గుర్తించారు.
ఇక మే 23న మేఘాలయలోని సోనమ్-రాజా రఘువంశీ జలపాతాన్ని చూసేందుకు నిటారుగా ఉన్న శిఖరానికి ట్రెక్కింగ్ చేశారు. హంతక ముఠా కూడా వారిని అనుసరించింది. ఒకానొక సమయంలో సోనమ్ అలసిపోయినట్లు నటించింది. దీంతో భర్త ముందుకు నడుచుకుంటూ వెళ్లాడు. హంతకులు కూడా చాలా దూరంగా ఉన్నారు. ఇంతలో భర్త ఒక నిర్జన ప్రదేశానికి చేరుకున్నాడు. ఇదే అనుకూల సమయమని వెంటనే చంపాలని కిరాయి ముఠాను సోనమ్ ప్రేరేపించింది. కానీ అలసిపోయామని.. ఇప్పుడు సాధ్యం కాదని ముఠా తేల్చి చెప్పింది. వెంటనే సోనమ్.. హంతకులకు రూ.20లక్షలు ఆఫర్ చేసింది. తక్షణమే తన భర్తను చంపితే రూ.20లక్షలు ఇస్తానని చెప్పుడంతో కిరాయి ముఠా.. రాజా రఘువంశీని కొట్టి చంపేశారు. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ముఠాతో కలిసి మృతదేహాన్ని స్వయంగా సోనమ్ లోయలోకి తీసేసింది. రాజా పోస్ట్ మార్టం రిపోర్టులో తల వెనుక మరియు ముందు భాగంలో రెండుసార్లు దెబ్బలు తగిలినట్లుగా తేలింది.
మే 23న జంట అదృశ్యమైంది. పోలీసులు రంగంలోకి దిగి జల్లెడ పట్టగా జూన్ 2న లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక సోనమ్ ఆచూకీ కోసం గాలిస్తుండగా జూన్ 9న యూపీలోని ఘాజీపూర్‌లో లొంగిపోయింది. అనంతరం హత్యలో పాల్గొన్న సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా, విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక భర్తను చంపేసిన తర్వాత సోనమ్.. మేఘాలయ నుంచి ఇండోర్‌కు వచ్చేసింది. అక్కడ ప్రేమికుడు రాజ్ కుష్వాహాను కలిసింది. అక్కడ ఒక అద్దె గది తీసుకుని బస చేశారు. అనంతరం కారు అద్దెకు తీసుకుని యూపీకి వెళ్లిపోయారు.