రాజా రఘువంశీ-సోనమ్ వివాహానికి సంబంధించిన విషయాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. రాజా రఘువంశీతో పెళ్లి కుదిర్చిన సమయంలో సోనమ్ తన తల్లితో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. రాజాను పెళ్లి చేసుకోనని.. అన్నయ్య కంపెనీలో పని చేస్తున్న రాజ్ కుష్వాహాను ప్రేమించానని.. అతడినే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది. అందుకు తల్లి తీవ్ర అభ్యంతరం చెప్పింది. దీంతో రాజా రఘువంశీని పెళ్లి చేసుకుంటాను.. కానీ తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని సోనమ్ తన తల్లిని బెదిరించింది. అన్నట్టుగానే సోనమ్ అన్నంత పని చేసింది.
ఇది కూడా చదవండి: Kangana : హనీమూన్‌లో భర్తని చంపిన భార్య కేస్ పై.. రియాక్ట్ అయిన కంగనా రనౌత్..
సోనమ్.. తల్లిదండ్రుల మాట కాదనలేకే రాజాను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తానో మీరే చూడండి.. అందరూ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని సోనమ్ ముందే హెచ్చరించినట్లుగా సోదరుడు తెలిపాడు. కానీ రాజాను చంపేస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదని వర్గాలు పేర్కొన్నాయి. సోనమ్, రాజ్ కుష్వాహాకు తెలిసిన ముగ్గురు సహచరులతోనే హత్యకు ప్లాన్ చేయడం విశేషం. డబ్బు కోసం కక్కుర్తి పడి ముగ్గురు కూడా హత్యకు ఒప్పుకున్నారు. ఇదంతా కావాలనే తన సోదరి చేసిందని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సోనమ్ సోదరుడు విపిన్ పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: US: లాస్ ఏంజిల్‌లో దిగజారిన పరిస్థితులు.. భారీగా లూటీలు.. కర్ఫ్యూ విధింపు
రాజా రఘువంశీ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త హత్యకు కర్త, కర్మ, క్రియ మొత్తం భార్య సోనమ్ రఘువంశీనే అని మేఘాలయ పోలీసులు తేల్చారు. మే 11న రాజా రఘువంశీ-సోనమ్ వివాహం జరిగింది. పెళ్లైన వెంటనే రాజా హత్యకు సోనమ్ స్కెచ్ గీసింది. 3 రోజులు అత్తగారింట్లో ఉంది. ఆ 3 రోజులు ఆయా కారణాలు చెప్పి భర్తకు దూరంగా ఉంది. ఆ సమయంలోనే ప్రియుడు రాజ్ కుష్వాహాకు సోనమ్ మెసేజ్ పెట్టింది. భర్తతో సన్నిహితంగా ఉండలేకపోతున్నానని చెప్పింది. 3 రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని పుట్టింటికి వచ్చేసింది. పుట్టింటికి రాగానే ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది. దీంతో రూ.4 లక్షలకు కిరాయి హంతకులను పురమాయించింది. నిందితులు గౌహతికి వెళ్లాలని సూచించారు. కానీ సోనమ్, ఆమె ప్రియుడు మాత్రం మేఘాలయ టూర్ ప్లాన్ చేశారు.
ఇక మే 20న భర్త రాజాతో కలిసి సోనమ్ మేఘాలయకు వచ్చింది. ఈ జంటను హంతక ముఠా వెంటాడుతోంది. స్థానికంగా ఒక స్కూటీని తీసుకుని జంట విహరిస్తూ ఉండేది. ఎక్కడికెళ్లినా సోనమ్.. ప్రియుడికి లొకేషన్ పంపిస్తూ ఉండేది. అలా జంటను కిరాయి ముఠా వెంటాడుతూ ఉండేది.
నూతన జంట తొలుత బెంగళూరుకు వచ్చారు. అక్కడ సోనమ్ నియమించుకున్న హంతక ముఠా కలిశారు. కిరాయి హంతకులు కూడా సోనమ్ నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన వారే. దీంతో ముఠా సభ్యులు.. కొత్త జంటతో ముచ్చటించారు. తెలిసిన వారు మాట్లాడుతున్నారని రాజా రఘువంశీ అనుమానించలేకపోయాడు. అక్కడ నుంచి నేరుగా ఈశాన్యానికి కనెక్టింగ్ విమానంలో జంట ప్రయాణించింది.
భర్తతో ఉండలేకే సోనమ్ హంతకులను నియమించుకుందని.. ప్రేమికుడితో కలిసి జీవించాలని డిసైడ్ అయిందని పోలీసులు తెలిపారు. పక్కా ప్లాన్‌తో వన్ వే టికెట్ ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఇక ప్రియుడు మేఘాలయకు రాకపోయినా సోనమ్ నిత్యం టచ్‌లోనే ఉందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక నిందితులు మే 21న గౌహతిలో జంటను వెంబడించారని.. జంట ఉన్న హోటల్‌లోనే బస చేశారని సీసీకెమెరాల్లో రికార్డైన దృశ్యాలను బట్టి గుర్తించారు.
ఇక మే 23న మేఘాలయలోని సోనమ్-రాజా రఘువంశీ జలపాతాన్ని చూసేందుకు నిటారుగా ఉన్న శిఖరానికి ట్రెక్కింగ్ చేశారు. హంతక ముఠా కూడా వారిని అనుసరించింది. ఒకానొక సమయంలో సోనమ్ అలసిపోయినట్లు నటించింది. దీంతో భర్త ముందుకు నడుచుకుంటూ వెళ్లాడు. హంతకులు కూడా చాలా దూరంగా ఉన్నారు. ఇంతలో భర్త ఒక నిర్జన ప్రదేశానికి చేరుకున్నాడు. ఇదే అనుకూల సమయమని వెంటనే చంపాలని కిరాయి ముఠాను సోనమ్ ప్రేరేపించింది. కానీ అలసిపోయామని.. ఇప్పుడు సాధ్యం కాదని ముఠా తేల్చి చెప్పింది. వెంటనే సోనమ్.. హంతకులకు రూ.20లక్షలు ఆఫర్ చేసింది. తక్షణమే తన భర్తను చంపితే రూ.20లక్షలు ఇస్తానని చెప్పుడంతో కిరాయి ముఠా.. రాజా రఘువంశీని కొట్టి చంపేశారు. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ముఠాతో కలిసి మృతదేహాన్ని స్వయంగా సోనమ్ లోయలోకి తీసేసింది. రాజా పోస్ట్ మార్టం రిపోర్టులో తల వెనుక మరియు ముందు భాగంలో రెండుసార్లు దెబ్బలు తగిలినట్లుగా తేలింది.
మే 23న జంట అదృశ్యమైంది. పోలీసులు రంగంలోకి దిగి జల్లెడ పట్టగా జూన్ 2న లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక సోనమ్ ఆచూకీ కోసం గాలిస్తుండగా జూన్ 9న యూపీలోని ఘాజీపూర్‌లో లొంగిపోయింది. అనంతరం హత్యలో పాల్గొన్న సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా, విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక భర్తను చంపేసిన తర్వాత సోనమ్.. మేఘాలయ నుంచి ఇండోర్‌కు వచ్చేసింది. అక్కడ ప్రేమికుడు రాజ్ కుష్వాహాను కలిసింది. అక్కడ ఒక అద్దె గది తీసుకుని బస చేశారు. అనంతరం కారు అద్దెకు తీసుకుని యూపీకి వెళ్లిపోయారు.