India's aid to Gaza: ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం నడుమ గాజాలోని సాధారణ పాలస్తీనా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ రాకెట్ ఎటునుంచి వస్తుందో అని, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో అని భయపడుతున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ ని దిగ్భంధించింది. ఉత్తర గాజాలోని ప్రజలను సురక్షితమైన దక్షిణ ప్రాంతాలకు వెళ్లాలని సూచించడంతో, ఆ ప్రాంతంలోని 10 లక్షల మందిలో 7 లక్షల మంది దక్షిణ వైపు వెళ్లారు.