దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. స్నేహం పేరుతో హోటల్‌కు పిలిచి సహచర విద్యార్థినిపై ఎంబీబీఎస్ విద్యార్థి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా వీడియోలు లీక్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో చేసేదేమీలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: CJi Gavai: సుప్రీంకోర్టులో లాయర్ దుశ్చర్య.. సీజేఐ గవాయ్‌పై షూతో దాడి!
హర్యానాలోని జింద్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని (18) ఢిల్లీలోని రోహిణిలోని బాబా సాహెచ్ అంబేద్కర్ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఉంటూ విద్యను అభ్యసిస్తోంది. ఈ క్రమంలో సహచర స్టూడెంట్(20) పరిచయం అయి ఢిల్లీలోని ఆదర్శ నగర్ ప్రాంతంలోని ‘‘హోటల్ ఆపిల్’కు పిలిచాడు. సెప్టెంబర్ 9న హోటల్‌కు వెళ్లిన విద్యార్థినికి మత్తు మందు కలిపిన పదార్థం ఇవ్వడంతో స్పృహ కోల్పోయింది. ఇదే అదునుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇది కూడా చదవండి: Cough syrup Alert: దగ్గు సిరప్‌పై తెలంగాణ ఆరోగ్యశాఖ అలర్ట్.. మార్గదర్శకాలు విడుదల
అందుకు సంబంధించిన వీడియోలను మొబైల్‌లో రికార్డ్ చేశాడు. నగ్న వీడియోలు, ఫొటోలు చూపించి బెదిరింపులకు దిగాడు. పదే పదే విసిగించడంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. మత్తు మందు ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని.. స్నేహం పేరుతో పిలిస్తే వెళ్లినట్లుగా చెప్పింది. మత్తులో ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేసి వీడియో రికార్డ్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని.. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Gold Rates: వామ్మో బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే…!