Dating App Scams: డేట్ అని అమ్మాయిని కలవడానికి వెళ్లారో, జేబు ఖాళీ.. వెలుగులోకి “డేటింగ్ స్కామ్”..
- బయటపడుతున్న డేటింగ్ యాప్ మోసాలు..
- డేట్ పేరుతో బయటకు వెళ్తే జేబులు ఖాళీ..
- ముఠాగా ఏర్పడి భారీ స్కామ్..
- పరువు పోతుందనే భయంతో ఫిర్యాదుకు వెనకంజ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dating App Scams: ఇటీవల ఢిల్లీలో ఓ సివిల్ సర్వీస్ ఔత్సాహికడు డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళతో డేటింగ్ వెళ్తే ఓ కేఫ్‌లో రూ. 1.20 లక్షల బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ‘టిండర్ స్కామ్’కి సంబంధించి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. చాలా మంది తాము డేటింగ్ యాప్‌లో ఉన్నామని తెలిస్తే పరువుపోతుందనే భయంతో చాలా కేసులు వెలుగులోకి రావడం లేదు. దీంతోనే కొందరు ఇలా స్కామ్ చేసి డబ్బును దండుకుంటున్నారు. రెడ్డిట్‌లో అనేక పోస్టులు తమకు జరిగిన అనుభవాలను పంచుకుంటున్నారు.
Tinder, Bumble, Hinge మరియు OKCupid వంటి డేటింగ్ యాప్‌లో బాధితుడు మహిళతో మ్యాచ్ అవుతుంటాడు. వెంటనే సదరు యువతి వాట్సాప్ నంబర్‌ని షేర్ చేస్తుంది. ఆ తర్వాత వీరిద్దరు మాట్లాడుకుంటారు. అయితే డేట్‌కి ఓ రోజు ఫిక్స్ చేసుకుంటారు. యువతి బాధితుడైన వ్యక్తిని ఒక నిర్ధిష్ట ప్రదేశానికి రావాలని కోరుతుంది. అక్కడ పబ్ లేదా కేఫ్‌కి ఇద్దరు వెళ్తారు. కేఫ్‌లో యువతి ఆర్డర్ ఇస్తుంది. డేట్ ఆతృతతో అతను ఎలాంటి అనుమానాన్ని వ్యక్తం చేయడు. మెనూలోని ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. ఆ తర్వాత అర్జెంట్‌గా బయటకు వెళ్లాలని చెప్పి అక్కడ నుంచి జారుకుంటుంది. అయితే, బిల్లు వచ్చినప్పుడు అసలు విషయం బాధితుడికి అర్థం అవుతుంది. తాను అంచనా వేసినదాని కన్నా ఎక్కువ బిల్లు వచ్చినట్లు గుర్తిస్తాడు. కొన్ని సందర్భాల్లో బిల్ గురించి సంబంధిత నిర్వాహకులతో వాగ్వాదానికి దిగితే, బౌన్సర్లతో బెదిరించి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తారు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నా పోలీసుల వద్దకు కంఫ్లైట్ రాదు. ఎందుకంటే డేటింగ్ యాప్‌లో మహిళల్ని కలుస్తున్నాడనే విషయం తమకు కుటుంబంలో తెలిస్తే బాగుండదనే భయంతో ఎవరూ ఎలాంటి ఫిర్యాలు చేయడం లేదు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: Kalki 2898 AD Collections: బాక్సాఫీస్‌పై కల్కి దండయాత్ర.. 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఐఏఎస్ కావాలనే ఔత్సాహికుడిని ఇలాగే టార్గెట్ చేసి దోచిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పోలీసులు కేఫ్ యామాని అక్షయ్ పహ్వా, డేటింగ్‌కి పిలిచిన యువతి అఫ్సాన్ పర్వీన్‌లను అరెస్ట్ చేశారు. కేఫ్ యజమానులు, నిర్వాహకులు అందరూ ఈ స్కామ్‌లో ఉన్నారు. బాధితుడి నుంచి స్కామ్ చేసి దోచుకున్న డబ్బులో తలా ఇంత అని పంచుకుంటారు. బిల్లులో 15 శాతం మహిళకు వెళ్తే, 45 శాతం మేనేజర్, 40 శాతం పబ్ లేదా కేఫ్ యజమానులకు వెళ్తుంది.
ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు ముంబై, బెంగళూర్, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఈ కుంభకోణం జరుగుతోంది. ఈ నెల ప్రారంభంలో యాక్టివిస్ట్ దీపికా నారాయణ్ భరద్వాజ్ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఇలాంటి రాకెట్ గురించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఒకే క్లబ్ మూడు వేర్వేరు పేర్లతో పనిచేస్తుందని, ఒకే మహిళ డేటింగ్ యాప్‌లలో పలువురిని ఆకర్షించి పబ్‌కి రప్పించి బాధితులను మోసం చేస్తున్నట్లు వెల్లడైంది. బాధితుడు బిల్లు రూ. 20,000 కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది రూ. 40,000 వరకు ఉంటుంది.
ఒక్క పురుషులే కాదు, స్త్రీలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో డేటింగ్ యాప్‌లో మహిళతో ఫ్రెండ్‌షిప్ చేసి వారి ఇంటిని దోచుకున్న ఇద్దరు వ్యక్తుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను విజయ్ కుమార్ కమల్ (28), రాహుల్ (35)గా పోలీసులు గుర్తించారు. డేటింగ్ యాప్‌లో తనను జతిన్ అని పరిచయం చేసుకున్న వ్యక్తి తన ఇంట్లో దోచుకున్నాడని 35 ఏళ్ల మహిళ మే 31న ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని సీనియర్ పోలీసు అధికారి అంకిత్ సింగ్ తెలిపారు. మే 30న రాహుల్ తన ఇంటికి వెళ్లే ముందు తాను, జతిన్ (విజయ్ కుమార్ కమల్)తో కలిసి మెసేజ్‌ల ద్వారా మాట్లాడుకునేవారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. “ఇద్దరూ ఆమె బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ మరియు రూ. 5,000 నగదును దోచుకుని పారిపోయారని అధికారి తెలిపారు.
## HYDERABAD DATING SCAM ALERT ##
◾1 club, different names, daily trapping
◾3 men scammed by same girl reached out
◾8 victims in touch, scammed at same club
◾Trap laid through Tinder, Bumble
◾Bill amounts of 20-40K@hydcitypolice @TelanganaDGP @TelanganaCOPs @zomato pic.twitter.com/06xtRp6fHO— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 6, 2024
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!