Kalki 2898 AD Collections: బాక్సాఫీస్‌పై కల్కి దండయాత్ర.. 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
- 27న కల్కి విడుదల
- బాక్సాఫీస్‌పై దండయాత్ర
- 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD 3 Days Collections: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌పై దండయాత్రను కొనసాగిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో రూ.415 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వరుసగా మూడో రోజు రూ.100 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసింది. రెండో రోజుతో పోల్చితే.. మూడవ రోజు కలెక్షన్లు పెరిగాయి. ఓవైపు టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్, మరోవైపు వర్షాలు పడుతున్నా.. మూడోరోజైన శనివారం ఫాన్స్ థియేటర్లకు పరుగులు తీశారు.
కల్కి 2898 ఏడీ సినిమా అమెరికాలో 9 మిలియన్లను క్రాస్ చేసి.. 10 మిలియన్ల దిశగా దూసుకుపోతోంది. నాలుగో రోజు (ఆదివారం) హాలిడే కావడంతో మొదటి వారాంతం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూల్ అవుతాయని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శనివారం 31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, 19.80 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. నైజాంలో శనివారం రోజు 10 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుందట.
Also Read
Also Read: Anushka Sharma: భారత్ గెలవగానే.. నా కూతురు ఆందోళన చెందింది: అనుష్క
కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న విడుదలైంది. తొలి రోజే రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. భారతీయ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి తెరకెక్కించిన ఈ చిత్రానికి అడియన్స్ ఫిదా అఏవుతున్నారు. వైజయంతీ మూవీస్ ఈ చిత్రంను రూ. 600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. ఇది దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. ఈ మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!