Site icon NTV Telugu

Pakistan: ఉగ్రవాదుల సామూహిక అంత్యక్రియలు.. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ హాజరు, వీడియోలు వైరల్..

Pak

Pak

Pakistan: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా జరిపిన ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’కి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపుగా 80 మంది వరకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఈ రెండు ఉగ్ర సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్న బహవల్పూర్, మురిడ్కేపై దాడులు నిర్వహించడం ఈ ఆపరేషన్‌కే హైలెట్‌గా మారింది.

Read Also: Ponnam Prabhakar: “ఆపరేషన్ సింధూర్” విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న మంత్రి!

ఇదిలా ఉంటే, ఈ దాడుల్లో అనుకున్న సంఖ్య కన్నా ఎక్కువ మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. కీలక ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. వీరందరికి సామూహిక అంత్యక్రియలు చేపడుతున్నారు. వీరి మృతదేహాలపై పాకిస్తాన్ జెండాను ఉంచి నివాళులు అర్పిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఎంత మద్దతు ఇస్తుందో తెలుస్తోంది.

ఇన్నాళ్లు మా దేశంలో ఉగ్రవాదులు లేరని బుకాయిస్తూ వస్తున్న పాకిస్తాన్, చనిపోయిన ఉగ్రవాదులు అంత్యక్రియల్లో, ఊరేగింపుల్లో పాల్గొనడటం చర్చనీయాంశంగా మారింది. పాక్ ఆర్మీ, పాకిస్తాన్ పోలీసులు, ఐఎస్ఐ అధికారులు ఉగ్రవాదులకు నివాళులు అర్పిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీరంతా ఉగ్రవాదుల అంతిమ యాత్రలో ముందు వరసలో పాల్గొన్నారు.

Exit mobile version