Horrific Accident: సవదత్తి యల్లమ్మ దేవి దర్శనానికి వెళుతుండగా డ్రైవర్ అజాగ్రత్త కారణంగా బుల్లోరో వాహనం చెట్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగి వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా చుంచనూర్ గ్రామ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ విషాద సంఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు. ప్రమాదంలో మరణించిన వారికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం.
Read also: Gun Fire: ఇంటి ముందు మూత్రం పోయొద్దన్నందుకు తుపాకీతో కాల్పులు
కర్ణాకటక బెళగావి జిల్లా రామదుర్గ తాలూకాలోని చుంచనూర్ సమీపంలోని విఠల్ రుక్మిణి ఆలయంలోని మర్రి చెట్టును బులోరో వాహనం ఢీకొన్నట్లు సమాచారం. పాదయాత్రకు వెళ్లిన భక్తులను బులోరో డ్రైవర్ స్వయంగా పిలిచి వాహనంలో కూర్చోబెట్టారు. బులోరో వాహనంలో సవదత్తి యల్లమ్మ గుడికి వెళ్తుండగా వాహనం అదుపుతప్పడంతో.. విఠలప్ప దేవాలయం ఎదురుగా ఉన్న పెద్ద మర్రిచెట్టును వాహనం ఢీకొట్టింది. వాహనం బోల్తాపడి నుజ్జునుజ్జయింది.
Read also: Amit Shah: అస్సాంలో కేంద్ర మంత్రి అమిత్ షా విమానం అత్యవసర ల్యాండింగ్
ఈఘటనతో.. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతులు రామదుర్గ తాలూకాలోని హులకుంద గ్రామస్తులుగా గుర్తించారు. హనమవ్వ మేగాడి (25), దీప (31), సవిత (12), సుప్రీత (11), మారుతి (43), ఇంద్రవ్వ (24)లు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని గోకాక్‌తో పాటు ఇతర ఆసుపత్రులకు తరలించారు. కటకోల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Amit Shah: అస్సాంలో కేంద్ర మంత్రి అమిత్ షా విమానం అత్యవసర ల్యాండింగ్