Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృత్రిమ మేధస్సు (AI) తెచ్చిన సరికొత్త సాంకేతికత సినీ రంగానికి శాపంగా మారుతోందా? డీప్‌ఫేక్ వీడియోలు, అనామక ఖాతాలతో సాగే సైబర్ దాడులు టాలీవుడ్‌ను ఏ స్థాయికి నెట్టేస్తున్నాయి? ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ‘చుట్టమల్లె’ పాటకు సంబంధించిన డీప్‌ఫేక్ మార్ఫింగ్ ఉదంతం మొదలుకొని విడుదల కాకముందే సినిమాలను తొక్కేసే “పెయిడ్ నెగెటివిటీ” వరకు.. తాజా పరిణామాలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న డిజిటల్ అరాచకాలను అరికట్టేందుకు పరిశ్రమపరంగా కఠినమైన వ్యవస్థ రూపుదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన హెచ్చరించారు.
“వాళ్లకు ముఖాలు లేవు.. అందుకే భయం లేదు” అంటూ హీరో రామ్ పోతినేని గతంలో చేసిన ఘాటైన ట్వీట్‌ను ప్రస్తావించిన విష్ణు మంచు, సామాజిక మాధ్యమాల్లో జవాబుదారీతనం తీసుకురావాలంటే ప్రతి యూజర్ గుర్తింపునకు ఆధార్‌ను జోడించాలనే ఆలోచనను సీరియస్‌గా పరిశీలించాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. అనామకత్వం ముసుగులో వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేయడం, అసభ్యకరంగా దాడి చేయడం, కుటుంబాలను టార్గెట్ చేయడం ఇకపై చెల్లదని ఆయన పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడటం ఎంత ముఖ్యమో, ఇతరుల గౌరవాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యం అని ఆయన గుర్తుచేశారు.
Also Read
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
డీప్‌ఫేక్ బెడదతో పాటు పరిశ్రమను పట్టిపీడిస్తున్న మరో ప్రధాన రుగ్మతను విష్ణు ఎత్తిచూపారు. సినిమా నచ్చకపోతే ప్రేక్షకులు దాన్ని తిరస్కరించడం, విమర్శించడం సహజమని, కానీ థియేటర్లలోకి రాకముందే నెగెటివ్ రివ్యూలు, ట్రోలింగ్ ద్వారా చిత్రాలను దెబ్బకొట్టే కుట్రలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. సందీప్ కిషన్ తన ప్రాజెక్ట్‌పై కొందరు కావాలని విషం చిమ్ముతున్నారని గతంలో ఆవేదన వ్యక్తం చేసిన తీరును ఆయన గుర్తుచేశారు. ‘ది ప్యారడైజ్’ చిత్ర యూనిట్ విడుదలకు ముందే పరువు నష్టం కలిగించే కంటెంట్ నుంచి రక్షణ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి రావడం ప్రస్తుత విష సంస్కృతికి నిదర్శనమన్నారు. “ఒక సినిమా వెనుక ఎన్నో ఏళ్ల కష్టం, వందలాది పేద సినీ కార్మికుల కుటుంబాలు, నిర్మాతల కోట్ల రూపాయల పెట్టుబడి ముడిపడి ఉన్నాయి. ముందు సినిమాను రిలీజ్ కానివ్వండి… నచ్చకపోతే విమర్శించే హక్కు ప్రేక్షకుడికి ఎప్పుడూ ఉంటుంది” అని పిలుపునిచ్చారు.
ఇండస్ట్రీలోని అగ్ర కథానాయకుల ఫోటోలను డీపీలుగా పెట్టుకుని, తాము తటస్థులమని చెప్పుకుంటూ తోటి నటులను, వారి సినిమాలను దూషించే ఫేక్ అకౌంట్లపై విష్ణు మంచు ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒకరి సినిమా పోతే ఇంకొకరి సినిమా హిట్ అవుతుందనుకోవడం మూర్ఖత్వం. మన ఇండస్ట్రీ అందరికీ సరిపడేంత పెద్దది; ప్రతి ఒక్కరికీ న్యాయమైన వాటా దక్కుతుంది” అని పేర్కొంటూ, పదేపదే పెయిడ్ ట్రోలింగ్, దుష్ప్రచారాలకు పాల్పడుతున్న సోషల్ మీడియా ఖాతాలు, వాటిని నడిపిస్తున్న వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ల వివరాలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇప్పటికే సేకరిస్తోందని బాంబు పేల్చారు. నిజాయితీతో కూడిన రివ్యూలను అణచివేయడం తమ లక్ష్యం కాదని, డీప్‌ఫేక్ వేధింపులకు అడ్డుకట్ట వేసి, డిజిటల్ నేరాలకు పాల్పడే వారికి తగిన గుణపాఠం చెప్పేందుకే టాలీవుడ్ వ్యాప్తంగా ఒక పటిష్టమైన చట్టబద్ధ రక్షణ వ్యవస్థను తీసుకురానున్నామని విష్ణు మంచు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!