iPhone Making in India: స్మార్ట్ ఫోన్లలో ఐ ఫోన్ ఉత్తమమైనదే ప్రచారం ఉంది. అందులో ఉండే సాఫ్ట్ వేర్ నుంచి .. అందులో ఉండే ఫీచర్స్ వరకు అన్నీ ప్రత్యేకమే. చివరికి దాని ధర కూడా ప్రత్యేకంగా .. మిగిలిన ఫోన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఐ ఫోన్ ఇకపై ఇండియాలో కూడా తయారు కాబోతోంది. ఇందుకు సంబంధించి Apple Inc సంస్థతో ఇండియాకు చెందిన ఒక ప్రముఖ వ్యాపార సంస్థ చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. చర్చలు సఫలమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. చర్చలు సఫలమయి.. ఇండియాలో ఐ ఫోన్ తయారీకి Apple Inc సంస్థ అంగీకరిస్తే.. ఏడాది లోపుగా ఇండియాలో ఐ ఫోన్‌లు తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Read also: Sniffer Dogs: పోలీసు కుక్కలకు ఫేర్ వెల్ పార్టీ.. దండేసి ఘన సన్మానం
భారతదేశపు అతిపెద్ద సమ్మేళన సంస్థ అయిన టాటా గ్రూప్, ఆగస్ట్‌లో Apple Inc. సప్లయర్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందానికి దగ్గరగా ఉన్నట్టు తెలిస్తోంది. ఇదే గనుక జరిగితే ఒక దేశీయ కంపెనీ ఐఫోన్‌ల తయారీలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. 600 మిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన కలిగిన కర్ణాటకలోని విస్ట్రాన్ కార్పోరేషన్ ఫ్యాక్టరీని టాటా గ్రూప్ స్వాధీనం చేసుకోనున్నట్టు పేరు చెప్పడానికి నిరాకరించిన ఒకరు చెప్పారు. ఆ సంస్థలో సుమారు 10,000 కంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నారని.. వారంతా ఏడాది పాటు కష్టపడితే iPhone 14 మోడల్‌ను తయారు చేసే అవకాశం ఉంది. విస్ట్రాన్ సంస్థ మార్చి 2024 వరకు 1.8 బిలియన్ల అమెరికా డాలర్ల విలువైన iPhoneలను తయారు చేయనుంది. వచ్చే ఏడాది నాటికి ప్లాంట్ శ్రామిక శక్తిని మూడు రెట్లు పెంచాలని కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. విస్ట్రోన్ భారతదేశంలో ఐఫోన్ వ్యాపారం నుండి నిష్క్రమించినందున టాటా ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవడంతో ఐ ఫోన్ తయారీ ఒక దేశీయ సంస్థ ద్వారా తయారయ్యే అవకాశం ఉంటుందని వారంటున్నారు. భారతీయ ఐఫోన్‌ను రూపొందించడంతో యాపిల్ తన ఉత్పత్తులను చైనాకు మించి విస్తరించడానికి మరియు దక్షిణాసియా దేశంలో సాంకేతికత తయారీని నిర్మించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకునే అవకాశం ఉంది. జూన్ 30తో ముగిసిన మూడు నెలల్లో Wistron భారతదేశం నుండి దాదాపు 500 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఐఫోన్‌లను ఎగుమతి చేసింది.