Donkey Gift:వివాహ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. తన పెళ్లి ప్రత్యేకంగా జరగాలని అందరూ కోరుకుంటారు. గ్రాండ్‌గా చేయడానికి ఉత్సాహంగా ఉంటారు. అందరినీ ఆహ్వానించి ఘనంగా జరుపుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అయితే పెళ్లిలో కొత్త జంట చేసే చిలిపి చేష్టలు, ఫన్నీ సీన్స్ చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. దీంతో పెళ్లి వీడియోలు తక్కువ కాలంలోనే ఎక్కువ ఆదరణ పొందుతుంటాయి. కానీ పెళ్లిళ్లలో స్నేహితులు, బంధువులు వధూవరులకు బహుమతులు ఇచ్చేవి కూడా నవ్వులు తెప్పించే విధంగా ఉంటుంది. పెళ్లి పీటలపై వధువు వరుడికి బహుమతులు ఇవ్వడం, వరుడు పెళ్లికూతురికి కానుకలు ఇవ్వడం కూడా చూశాం. సాధారణంగా బంగారం, వెండి, వజ్రాల వస్తువులు బహుమతులుగా ఇస్తాస్తుంటారు ఇది మనందరికి తెలిసిన విషయమే కానీ.. పెళ్లి వేదికపై వధువుకు వరుడు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే షాక్ అవ్వల్సిందే.
Read also: Rickshaw drivers Protest: మరో సారి సమ్మెకు సై అంటున్న ఆటో వాలాలు
అజ్లాన్ షా పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్. అతనికి వరిష అనే యువతితో వివాహమైంది. అజ్లాన్ జంతువులను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో పెళ్లి సందర్భంగా భార్యకు గాడిదను బహుమతిగా ఇచ్చాడు. యువతికి గాడిదలు అంటే చాలా ఇష్టం కాబట్టి.. అవి ప్రపంచంలోనే అత్యంత కష్టపడి పనిచేసే, ప్రేమించదగిన జంతువులనే కారణంతో వాటిని తనకు ఇచ్చానని అజ్లాన్ చెప్పాడు. రూ.30వేలకు గాడిదను కొనుగోలు చేసి వివాహానంతర రిసెప్షన్‌లో అజ్లాన్ తన భార్యకు గాడిదను అందజేశాడు. అది చూసిన విరిష ఆగాడిదను ముద్దాడింది. థ్యాక్యూ అంటూ తన భర్త అజ్లాన్ కు ముద్దుపెట్టింది. ఆ ఇద్దరు ఆగాడిదను చూసి మురిసిపోయారు. ఆతరువాత డ్యాన్సులు ఆడుతూ అందరిని అలరించారు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయడంతో.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాసేపటికే చాలా మంది ఆ వీడియోను చూసి ఏందయ్యా ఇలాంటివి కూడా గిప్ట్ లు ఇస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. వరిషాకు రెండు గాడిదలు వచ్చాయని.. ఒకటి భర్త రూపంలో, మరొకటి బహుమతి రూపంలో వచ్చాయని సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.
पाकिस्तानी यूट्यूबर ने शादी में पत्नी को गिफ्ट किया गधे का बच्चा
Video हुआ वायरल। pic.twitter.com/fuI7L4tzNF— Priya singh (@priyarajputlive) December 10, 2022