కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనపై రచ్చ జరుగుతోంది. నేపాల్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వీడియో ఒకటి బయటకు వచ్చింది.. అది నైట్ క్లబ్ వీడియో అంటూ బీజేపీ నేతలు వైరల్ చేస్తూ.. రాహుల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.. దీనికి కాంగ్రెస్ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి.. ఇక, ఆ వీడియోపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించిన తీరుపై కాంగ్రెస్ మండిపడుతోంది.. చైనా దౌత్యవేత్తలతో కలిసి నేపాల్ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ పార్టీ చేసుకుంటున్న వీడియోతో చైనా హనీ ట్రాప్‌లు పెరుగుతుండడం కలవరపెడుతోందన్న ఆయన.. నేపాల్‌లోని చైనీస్ రాయబారి హౌ యాంకీ రాహుల్ గాంధీతో ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ యూరప్ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ అనవసర వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఆ పార్టీ సొంత నేతే వివాదంలో చిక్కుకున్నారంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.
Read Also: Chandrababu: టి.టీడీపీ నేతలతో బాబు టెలీకాన్ఫరెన్స్.. ప్రతీవారం సమీక్ష..
అయితే, సాయిరెడ్డి ట్వీట్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఠాగూర్.. అవినీతి విజయసాయిరెడ్డి నిజం తెలుసుకోవాలంటూ తీవ్రంగా స్పందించిన ఆయన.. మీ సమస్య జగన్ రెడ్డిపై ఉన్న అవినీతి కేసులని మాకు తెలుసు.. కానీ నిజం మర్చిపోకండి.. నేపాల్ అంబాసిడర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ నేపాల్ వెళ్లారని క్లారిటీ ఇచ్చారు.. తన ట్వీట్‌కు నేపాల్ చెందిన ఖాట్మండు పోస్ట్ పేపర్ క్లిప్‌ను టాగ్ చేసిన ఠాగూర్.. రాహుల్ గాంధీ వివాహ వేడుకకు హాజరుకావడంలో తప్పేముంది? అని నిలదీశారు.. మరోవైపు, మ్యారేజీ వేడుకకు రాహుల్ గాంధీ వెళ్లడం నేరమా ? పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ బర్త్ డేకు ఎలాంటి ఆహ్వానం లేకుండానే నరేంద్ర మోడీ వెళ్లినట్లు.. రాహుల్ వెళ్లలేదు కదా? అంటూ ఆ పార్టీ నేత సూర్జేవాలా కౌంటర్ ఎటాక్ చేశారు.. తన ఫ్రెండ్ ఆహ్వానం మేరకే రాహుల్ గాంధీ పెళ్లికి హాజరయ్యేందుకు నేపాల్ వెళ్లారని పేర్కొన్నారు.
Corrupt Vijayasai Reddy Pl see the truth . We know that your problem is the corruption cases against Jagan reddy for that you have to keep sahib happy .But dnt forget the truth. Mr Gandhi went to attend a wedding of the Nepal Ambassador daughter. What’s wrong in attending it ? pic.twitter.com/ueicImqhVY
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) May 3, 2022