కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనపై రచ్చ జరుగుతోంది. నేపాల్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వీడియో ఒకటి బయటకు వచ్చింది.. అది నైట్ క్లబ్ వీడియో అంటూ బీజేపీ నేతలు వైరల్ చేస్తూ.. రాహుల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.. దీనికి కాంగ్రెస్ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి.. ఇక, ఆ వీడియోపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించిన తీరుపై కాంగ్రెస్ మండిపడుతోంది.. చైనా దౌత్యవేత్తలతో కలిసి నేపాల్ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ పార్టీ…