UP: క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన రజత్ కుమార్ పరిస్థితి విషమం.. ఏం జరిగిందంటే..!
- క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన రజత్ కుమార్ పరిస్థితి విషమం
- ప్రియురాలితో కలిసి విషం తాగిన రజత్ కుమార్
- ప్రియురాలి మృతి.. రజత్ కుమార్ పరిస్థితి విషం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన రజత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు. విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
25 ఏళ్ల రజత్ కుమార్.. మను కశ్యప్ (21) అనే యువతిని ప్రేమించాడు. అయితే వారి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో వారు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే ప్రియురాలితో కలిసి రజత్ కుమార్ ఫిబ్రవరి 9న విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఈ ఘటనలో ప్రియురాలు ప్రాణాలు కోల్పోగా.. రజత్ కుమార్ చావు బతుకుల మధ్య కొట్టి మిట్టాడుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Also Read
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ఇది కూడా చదవండి: Ram Gopal Varma : స్లో మోషన్ లేకపోతే రజినీకాంత్ లేడు : రామ్ గోపాల్ వర్మ
2022లో క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడి రజత్ కుమార్ గుర్తింపులోకి వచ్చాడు. రిషబ్ పంత్ స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారుకి మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో వెళ్తున్న రజత్ కుమార్, అతని స్నేహితుడు నిషు కుమార్‌తో కలిసి రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడారు. ఈ ఘటనతో రజత్ కుమార్ మీడియాలో గుర్తింపు పొందాడు. అంతేకాకుండా వారిద్దరికీ రిషబ్ పంత్ రెండు స్కూటర్లు కూడా కొని ఇచ్చాడు. ఇదిలా ఉంటే రిషబ్ పంత్ ప్రస్తుతం పూర్తిగా కోలుకుని క్రికెటర్‌గా కొనసాగుతున్నారు. ఒక్క ఏడాదిలోనే రికవరీ అయిపోయాడు. తాజాగా రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వ్యక్తి పరిస్థితి ఇప్పుడు సీరియస్‌గా ఉండడం విశేషం.

తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?