టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జాబితాలో రామ్ గోపాల్ వర్మ స్థానం ఎవరు బర్తి చేయలేరు.. అతని సినిమాలకు గతంలో ఎలాంటి పాపులారిటి ఉండేదో అందరికీ తెలిసిందే. ప్రజంట్ ఆయన తీరు మొత్తం మారిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా, ప్రతి ఒకరి మీద ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. అయితే ప్రజంట్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘శారీ’. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆర్జీవీ ట్రైలర్‌ను విడుదల చేశాడు. అలాగే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్ని సూపర్ స్టార్ రజనీ కాంత్ పై అలాగే, బాలీవుడ్ గురించి మాట్లాడుతూ ఎప్పటిలాగే వివాదాస్పద కామెంట్ చేశాడు.
Also Read: Samantha: ఆటోలో షికార్లు కొడుతున్న సమంత..
వర్మ మాట్లాడుతూ ‘యాక్టింగ్ అనేది క్యారెక్టర్‌కు సంబంధించిన విషయం. పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నారు అనేదాన్ని బట్టి స్టార్ అవుతాడు. ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంటుంది. రజినీకాంత్ మంచి యాక్టరా? అని అడిగితే నాకు తెలియదు అనే అంటాను. ఎందుకంటే రజినీకాంత్ ‘సత్య’ లాంటి సినిమాను చేయలేకపోవచ్చు. ఆయనను ఇలాగే చూడాలని అందరూ అనుకుంటారు. అసలు స్లో మోషన్ లేకపోతే రజినీకాంత్ లేడు.ఆయన సినిమాలో అసలు ఏం చేయకుండా కేవలం స్లో మోషన్‌లో నడిచినా అది చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు. వారికి అదే ఆనందాన్ని ఇస్తుంది’ అంటూ ప్రస్తావించాడు.
అలాగే ‘ఇక ఇప్పుడు బాలీవుడ్‌లోకి కొత్త రకం దర్శకులు వచ్చారు. వాళ్లు హాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపిస్తూ..ఆ స్టైల్‌లోనే సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కానీ ‘పుష్ప 2’ లాంటి చిత్రాలను తెరకెక్కించే సత్త వారికి ఉన్న కానీ ధైర్యం చేయడం లేదు’ అంటూ తెలిపారు వర్మ. మరి ఇక్కడ వర్మ బాలివుడ్ దర్శకులను ముఖ్యంగా రజినికాంత్‌ని పొగిడారా లేక తిట్టారా అనేది నెటిజన్లకు అర్ధం కావడంలేదు.