దాంపత్య జీవితం అర్థం మారుతోంది. దాంపత్య జీవితంలో దండయాత్రలు తప్ప ఆనందంగా జీవితం గడిపేవారే కరువయ్యారు. ఏదో ఒక కారణంతో ఒకనొకరు చేయి చేసుకోవడం. చిన్నపాటి మాటలు గొడవలకు దారితీస్తున్నాయి. ఈ ఉరుకు పరుగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరు కుటుంబానికి దూరం అవుతుండటం ఒక భాగమైతే.. మరొకటి మద్యం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. మద్యం సేవించిన వారు ఎలా ప్రవర్తిస్తాడో తెలియని విధంగా మధ్యాన్ని సేవించి ఎదుటి వారిపై దాడి చేస్తున్నారు.
ఉద్యోగం పై ఒత్తిడో లేక కుటుంబ భారమో కాని.. ఎదుటి వ్యక్తులపై దాడి చేసేందుకు కూడా వెనకాడటం లేదు. భార్య ఆంమ్లెట్ వేయని కొందరు చనిపోతే, భార్య పుట్టింటికి రాలేదని మరొకొందరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే విషయాలు బయటకు వస్తాయి. అలాంటి కోవకు చెందిందే ఈ స్టోరీ.. మద్యం మత్తులో వున్న భర్త.. భార్యకు అన్నం వడ్డించమన్నాడు. అయితే ఆమె వడ్డించకపోవడంతో భార్యను అతి దారుణంగా చంపేసాడు. ఈఘటన దక్షిణ ఢిల్లీ లోని ఫతేపూర్ బేరీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ ప్రాంతంలో సోనాలి , వినోద్ కుమార్ దూబే ఇద్దరు నివాసం వుంటున్నారు. గురువారం రాత్రి ఇంటి వచ్చిన వినోద్, సోనాలి ఇద్దరు మద్యాన్ని సేవించాడు. దీంతో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. అయితే కొద్ది సేపు మద్యం సేవించిన వినోద్ భార్య సోనాలిని అన్నం వడ్డించమని అడిగాడు. కానీ ఆమె అతని మాటలను పక్కకు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మళ్ళీ మొదలైంది. కోపోద్రోక్తుడైన భర్త నేను అడిగితే నాకే అన్నం పెట్టవా అంటూ తీవ్ర ఆగ్రహానికి లోనై సోనాలి పై దిండుతో దాడి చేశాడు. ఈ గొడవలో సోనాలి ప్రాణాలు వదిలింది.
విషయం తెలిసిన అధికారులు శుక్రవారం ఉదయం 9:30 గంటలకు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోనాలి ఇంట్లో శవమై కనిపించారు. వినోద్‌ను శుక్రవారం అరెస్టు చేశారు పోలీసులు. గురువారం రాత్రి తాను, తన భార్య మద్యం సేవిస్తున్నట్లు వినోద్ పోలీసులకు తెలిపాడు. డిన్నర్ వడ్డించమని వినోద్ సోనాలిని కోరగా, ఆమె నిరాకరించడంతో.. ఇద్దరూ గొడవకు దిగారు, ఆ.. సమయంలో సోనాలి.. వినోద్‌ను చెంపదెబ్బ కొట్టింది. తర్వాత వినోద్ సోనాలిని చంపాడని నిందుతుడు వివరించినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (సౌత్) పవన్ కుమార్ తెలిపారు.
Maoist Letter: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం