Man Elope With Son Wife In Rajasthan: ప్రేమించడం తప్పు కాదు కానీ.. వావివరసలు లేకుండా ప్రేమిస్తేనే ఛెండాలంగా, జుగుస్పాకరంగా ఉంటుంది. అయినా సరే.. ఇతర అభిప్రాయాల్ని పట్టించుకోకుండా, ప్రేమ గుడ్డిది అన్నట్టు వావివరసలు లేకుండా ప్రేమించేసుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్‌లోనూ అలాంటి వింత ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ మామ తన కోడలితోనే ప్రేమలో పడ్డాడు. తన కొడుకు భార్య అని చూడకుండా, కోడలితో ప్రేమాయణం నడిపించాడు. అటు ఆమె కూడా భర్త కళ్లుగప్పి.. మామతో రాసలీలలు కొనసాగించింది. చివరికి.. వీళ్లిద్దరు అతనికి శఠగోపం పెట్టి, ఇంటి నుంచి పారిపోయారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Sea Level Rise: చెన్నై, కోల్‌కతాలకు పొంచిఉన్న ముప్పు.. పెరుగుతున్న సముద్ర మట్టాలు..
బుండీ జిల్లాలోని సిలార్ గ్రామంలో పవన్ వైరాగీ అనే వ్యక్తి తన భార్య, తండ్రి రమేశ్ వైరాగీతో నివాసం ఉంటున్నాడు. పవన్ దంపతులకు ఆరు నెలల చిన్న పాప కూడా ఉంది. పని నిమిత్తం భర్త బయటకు వెళ్తే.. ఇంట్లోనే ఉంటోన్న మామ, కోడలు మధ్య ప్రేమ చిగురించింది. దీంతో.. పవన్ లేని సమయంలో వాళ్లు రాసలీలలు కొనసాగించారు. ఈ క్రమంలోనే ఇంటి నుంచి పారిపోయారు. దీంతో.. పవన్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్య, తండ్రి ఇద్దరు లేచిపోయారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు.. తన భార్య అమాయకురాలని, మాయమాటలు చెప్పి తన తండ్రే ఆమెను తీసుకెళ్లాడని పేర్కొన్నాడు. తన తండ్రి ఇల్లీగల్ పనులు చేసేవాడని కూడా పవన్ తెలిపాడు. తన భార్యను ఎత్తుకెళ్లడమే కాకుండా, తన ద్విచక్ర వాహనాన్ని సైతం తండ్రి దొంగలించాడంటూ పవన్ చెప్పుకొచ్చాడు. ఎలాగైనా ఆ ఇద్దరి ఆచూకీ కనుగొనాలని పవన్ పోలీసుల్ని కోరాడు.
Nadendla Manohar: గ్లోబల్ సమ్మిట్ ఓ బూటకం.. అంకెల గారడీతో వైసీపీ ప్రభుత్వం మోసం
అయితే.. ఈ కేసుని పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఇప్పటివరకూ కేసు ముందుకు కదల్లేదని పవన్ ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలపై స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి అర్వింద్ భరద్వాజ్ మాట్లాడుతూ.. తాము ఈ కేసుని శ్రద్ధగా పరిశీలిస్తున్నామని చెప్పారు. దొంగలించబడ్డ ఆ ద్విచక్ర వాహనంతో పాటు పారిపోయిన ఆ జంట ఆచూకీ కనుగొనడం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇదిలావుండగా.. రాజస్థాన్‌లో ఇలాంటి వింత ఘటనలు చోటు చేసుకోవడం సహజమే! కొంతకాలం క్రితమే తన అల్లుడితో కలిసి 40 ఏళ్ల అత్త పారిపోయింది. మామ మత్తులో ఉన్నప్పుడు.. అత్తతో కలిసి అల్లుడు జంప్ అయ్యాడు.