Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..

  • బెంగాల్ రాజకీయాల్లో కొనసాగుతున్న హైడ్రామా..
  • సీఎం పదవి రాజీనామాకు మమతా బెనర్జీ ససేమిరా..
  • ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టుకు దీదీ..
  • రాష్ట్రపతి పాలన విధించుకోవాలని కేంద్రానికి సవాల్..
Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: బెంగాల్ రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 294 స్థానాలకు గానూ 207 స్థానాలు గెలుచుకుని బంపర్ విక్టరీ సాధించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) 80 స్థానాలకు మాత్రమే పరిమితమై ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. ఇదిలా ఉంటే, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, తాను సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని మమతా స్పష్టం చేశారు. 100 స్థానాల్లో విజయాన్ని దొంగిలించారంటూ బీజేపీపై మండిపడింది. కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి ఎన్నికల్ని అక్రమంగా నిర్వహించాయని ఆరోపించారు.

Read Also: VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..

ఇదిలా ఉంటే.. బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. గెలిచిన టీఎంసీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆమె బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో బీజేపీ గెలుపును సవాల్ చేస్తానని ప్రకటించారు. స్థానికంగా ఓటములు ఎదురైనా, తన ప్రాథమిక లక్ష్యం ఢిల్లీ పీఠమే అని, ఇండియా కూటమి ఐక్యంగా పోరాటం కొనసాగిస్తుందని ఆమె అన్నారు.

సంబంధిత వర్గాల సమచారం ప్రకారం.. మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బలవంతంగా దొంగిలించబడిన గెలుపుకు నిరసనగా తాను పదవిలో కొనసాగాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని అభిషేక్ బెనర్జీ కూడా చెప్పాడు. ఎన్నికల ప్రక్రియకు నిరసనగా తాము పదవిలో కొనసాగాలనుకుంటున్నట్లు చెప్పింది. కేంద్రం చర్యలు తీసుకోవాలంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చని, అయితే, ఈ విషయం అధికారిక రికార్డుల్లో నమోదు కావాలని మమతా పేర్కొన్నారు.