Site icon NTV Telugu

Mamat Banerjee: ఐ-ప్యాక్‌పై ఈడీ దాడులు.. మమత బెనర్జీ పరుగో పరుగు.. చేతిలో ‘‘గ్రీన్ ఫైల్’’

Mamata

Mamata

Mamat Banerjee: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగాల్‌లో ఈడీ సంచలన దాడులు నిర్వహించింది. సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయ కన్సల్టెన్సీగా పనిచేస్తున్న ఐ-ప్యాక్‌పై ఈడీ దాడులు చేయడం సంచలనంగా మారింది. ఈ దాడుల సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. తాజాగా ఈడీ దాడులు టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ-ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ)కి సంబంధించిన రెండు ప్రదేశాలలో ఈడీ ఏకకాలంలో ఈ రోజు దాడులు చేసింది. ఐ-ప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసం, సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఆఫీస్‌లో సోదాలు జరిగాయి.

Read Also: Bangladesh: దీపు చంద్ర దాస్ హత్యలో కీలక నిందితుడి అరెస్ట్.. మసీదు బోధకుడే సూత్రధారి..

ఐ-ప్యాక్‌తో టీఎంసీ మంచి సంబంధాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఐ ప్యాక్ పనిచేసింది. ఈడీ దాడుల సమయంలో కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ హుటాహుటిన జైన్ నివాసానికి వెళ్లారు. కొద్దిసేపటికే అక్కడికి సీఎం మమతా బెనర్జీ చేరుకోవడం సంచలనంగా మారింది. కొన్ని నిమిషాల తర్వాత, ఆమె చేతిలో గ్రీన్ ఫైల్ ఉండటం, కంగారుగా కనిపించడం వైరల్ అయింది. ఈ దాడుల గురించి మాట్లాడుతూ.. ఇది రాజకీయ ప్రేరేపితమని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఇది జరిగిందని ఆరోపించారు. తృణమూల్ ఎన్నికల వ్యూహాలను, 2026 ఎన్నికల అభ్యర్థల జాబితాను, పార్టీ రహస్య పత్రాలను పొందేందుకే ఈ దాడులు చేసినట్లు ఆమె ఆరోపించింది. ఎన్నికల వ్యూహాల ఫైళ్లను దొంగలించడానికి ఈడీ ప్రయత్నిస్తోందని అన్నారు.

జైన్ నివానం నుంచి, నేరుగా సాల్ట్ లేక్ ప్రాంతంలోని దాని కార్యాలయం వద్దకు చేరుకున్న మమతా బెనర్జీ, వెనక ద్వారం నుంచి ఆఫీసులోకి వెళ్లారు. 15-20 నిమిషాల తర్వాత ఆమె బయటకు వచ్చారు. ఆమెతో సీఎంఓ అధికారులు అనేక ఫైళ్లను పట్టుకెళ్లడం కనిపించింది. మమత వచ్చిన కారు వెనకలో ఈ ఫైళ్లను ఉంచారు. అయితే, ఈ సోదాలు మనీలాండరింగ్‌కు సంబంధించినవి అని ఈడీ చెబుతోంది. ఇదిలా ఉంటే, మమతా బెనర్జీ, ఆమె సిబ్బంది రాష్ట్ర పోలీసులు ఫిజికల్ పేపర్స్, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను బలవంతంగా తొలగించారని ఈడీ పేర్కొంది. ఇప్పుడు మమత తీసుకెళ్లిన ఫైళ్లలో ఏమందనేది ఆసక్తికరంగా మారింది. ఒక ఫైల్‌పై ‘‘ఫిబ్రవరి 2022’’గా ఉంది, మరో ఫైల్‌లో టీఎంసీ నాయకుల ప్రయాణ వివరాలు ఉన్నాయి. మరో పేపర్‌లో ‘‘మహువా మోయిత్రా x 1’’ అని ఉంది.

Exit mobile version