Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బోగీ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saharsa Passenger Train Fire: బీహార్‌లోని సహర్సా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమస్తిపూర్-సహర్సా ప్యాసింజర్ రైలు (నంబర్: 63344)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిమ్రీ బఖ్తియార్పూర్ రైల్వే స్టేషన్లో తీవ్ర కలకలం రేగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. దీనితో రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు వెంటనే స్పందించడంతో అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊపిరిపీల్చుకున్నారు.
సోమవారం ఉదయం సుమారు 3:40 గంటలకు సమస్తిపూర్ నుంచి సహర్సా వెళ్తున్న ప్యాసింజర్ రైలు సిమ్రీ బఖ్తియార్పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ నంబర్-2 వద్ద ఆగింది. ఈ సమయంలో ఇంజిన్‌కు ఆనుకుని ఉన్న బోగీలోని బ్యాటరీ బాక్స్ సమీపంలో పొగ రావడం మొదలైంది. మొదట్లో దీనిని సాధారణ సాంకేతిక లోపంగా అనుకున్నప్పటికీ, కొద్ది నిమిషాల్లోనే అది భారీ మంటగా మారి మొత్తం బోగీని ఆహుతి చేసింది. దీంతో ఒక బోగీ పూర్తిగా దగ్ధమైంది.
Also Read
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ఘటన సమయంలో రైల్వే అధికారులు స్టేషన్లో అత్యవసర ప్రకటనలు చేసి ప్రయాణికులను వెంటనే రైలు నుంచి దిగాలని సూచించారు. ఆ తర్వాత RPF, GRP పోలీసులు, రైల్వే సిబ్బంది కలిసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. ఇక అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించిన తర్వాత అగ్నిని పూర్తిగా అదుపు చేయగలిగారు. వేగంగా చేపట్టిన సహాయక చర్యలతో పెను ప్రమాదం తప్పింది.
ఈ అగ్నిప్రమాదం కారణంగా సహర్సా-సమస్తిపూర్ రైల్వే మార్గంలో సుమారు రెండు గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రైళ్లను మధ్యలో నిలిపివేయగా, మరికొన్నింటిని ఆలస్యంగా నడిపించారు. ప్రభావితమైన రైళ్లలో మనిహారి-జయనగర్ జానకీ ఎక్స్‌ప్రెస్, కోసీ ఎక్స్‌ప్రెస్, దేవఘర్ ప్యాసింజర్‌తో పాటు మరికొన్ని రైళ్లు ఉన్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
A fire broke out in the engine and an adjoining coach of passenger train number 63344 (Samastipur–Saharsa) at Simri Bakhtiyarpur railway station in Bihar's Saharsa around 3 am. Passengers were evacuated safely, and no casualties have been reported. pic.twitter.com/4DjCGnMrLJ
— Vani Mehrotra (@vani_mehrotra) August 3, 2026
తాజావార్తలు
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!