Mamata Banerjee : బెంగాల్ హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం.. వెనక్కి తగ్గేది లేదు
- ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయన్న మమతా బెనర్జీ
- ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు
- ఆలయాలు, మసీదులు, వక్ఫ్ ఆస్తులపైనా అక్రమాలంటూ విమర్శలు
- యువత ముందుకు రావాలి.. సేవ్ ఇండియా – సేవ్ డెమోక్రసీ నినాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం , పౌరుల ప్రాథమిక హక్కులు తీవ్ర ముప్పులో పడ్డాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఓటు హక్కుల పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య కాపాడుకోవడానికి పోరాడుతున్న విద్యార్థులు, యువత, న్యాయవాదులు, పౌరసమాజ సంస్థలతో పాటు కాక్రోచ్ జనతాపార్టీ నేతలకు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు. బెంగాల్ ప్రజలు ప్రస్తుత పరిణామాల వల్ల తీవ్ర బాధితులుగా మారారని, రాష్ట్ర హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఎన్నికల వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు.. అక్రమాలపై మండిపాటు
దేశంలో ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఓటర్ల జాబితాల నుంచి లక్షలాది మంది ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని, ఓటర్ల గుర్తింపు వివరాలు, సిమ్ కార్డుల వ్యవహారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓటర్ల హక్కులపై తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తున్నారని విమర్శించారు. “మేము ఎన్నికల్లో ఓడిపోలేదు, కుట్రపూరితంగా మమ్మల్ని ఓడించారు. ఈ అన్యాయంపై రాజకీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తాం” అని తేల్చిచెప్పారు. దేశంలో రైతులు, కార్మికులు, మహిళలు, యువత హక్కులను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.
Also Read
- Punjab: పంజాబ్ ఆప్‌లో అసంతృప్తి సెగ.. పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా!
- Rahul Gandhi: బీజేపీ బలవంతంగా దుకాణాలు మూసివేయించింది.. రాహుల్ సంచలన ఆరోపణలు!
- BJP vs Congress: సిక్కు వ్యతిరేక అల్లర్ల రోజే ర్యాలీ ఎందుకు.? రాహుల్‌ను ప్రశ్నించిన జేపీ నడ్డా!
- Delhi: ఓపెన్ టాప్ జీపులో రాహుల్ గాంధీ.. మమత, అఖిలేష్ సహా విపక్ష నేతలతో ర్యాలీ!
ఆలయ నిధులు, వక్ఫ్ ఆస్తులైనా వదలడం లేదు
రామమందిరం విరాళాలు, బెంగాల్‌లోని ప్రముఖ ఆలయాల నిధులు, గురుద్వారాలు, మసీదులు , వక్ఫ్ ఆస్తుల విషయంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రజల ఆత్మగౌరవం, జీవనోపాధి, రాజ్యాంగ స్ఫూర్తి అన్నీ ప్రమాదంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం మానాలని, నిష్పక్షపాతంగా పనిచేయాలని హితవు పలికారు. నాయకులను, ప్రజలను గృహ నిర్బంధంలో ఉంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని, పోలీసుల అణచివేతతో కాకుండా ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని స్పష్టం చేశారు.
యువత ముందుకు రావాలి.. ‘సేవ్ ఇండియా – సేవ్ డెమోక్రసీ’
“భయపడేవారు కాదు.. ధైర్యంగా నిలబడి పోరాడేవారే చరిత్ర సృష్టిస్తారు” అని మమతా బెనర్జీ ఉద్బోధించారు. కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పౌరుల హక్కులను రక్షించడంలో , న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థ మరింత చురుకైన పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే పోరాటానికి యువత, విద్యార్థులే నాయకత్వం వహించాలని, సీనియర్ నేతలుగా తాము వెనకుండి మార్గనిర్దేశం చేస్తామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, ‘సేవ్ ఇండియా – సేవ్ డెమోక్రసీ’ నినాదంతో బీజేపీని అధికార పీఠం నుంచి గద్దె దించడమే లక్ష్యంగా కులమతాలకు అతీతంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Mamata Banerjee : బెంగాల్ హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం.. వెనక్కి తగ్గేది లేదు
-
Ind Vs NZ: భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
-
NASA Swift Telescope: నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ.!
-
RAAKA: ‘రాకా’ ఇంటర్వెల్ కోసం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్.. బన్నీ ఫ్యాన్స్‌కు పండగే!
-
Prabhas Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లోకి ప్రభాస్ రీ-ఎంట్రీ.. వైరల్ అవుతున్న షూటింగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!