Mamata Banerjee: టీఎంసీ తొలి జాబితా విడుదల.. మమతా బెనర్జీ పోటీ ఎక్కడ్నుంచంటే..!
- టీఎంసీ తొలి జాబితా విడుదల
- జాబితాలో ముఖ్యమంత్రి మమత
- మమత ప్రత్యర్థిగా బీజేపీ నేత సువేందు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 294 స్థానాలకు గాను 291 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. మమతా బెనర్జీ భబానీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఇప్పటికే బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించేసింది. సువేందు అధికారిని భబానీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల నుంచి పోటీకి దింపింది. గతంలో నందిగ్రామ్‌లో సువేందు అధికారిపై మమత ఓటమి చెందారు. ప్రస్తుతం మమత భబానీపూర్ నుంచి బరిలోకి దిగారు. ఈసారి భబానీపూర్ నుంచే పోటీ చేస్తారా? మరొక నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా? అన్నది సస్పెన్ష్‌గా ఉంది.
ఇది కూడా చదవండి: Pak-Afghan war: పిరికిపంద.. అమానుష దాడి.. పాక్ ఘాతుకాన్ని ఖండించిన భారత్
Also Read
పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 152, 142 స్థానాలకు రెండు దశల వారీగా పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మాత్రం మే 4న జరగనుంది.
ఇక అభ్యర్థుల జాబితాను విడుదల చేసే ముందు మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అభ్యర్థుల జాబితాను ప్రకటించే ముందు నేను బెంగాల్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను బీజేపీకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరెందుకు భయపడుతున్నారు? మీరు పోరాడాలనుకుంటే గ్యాస్ సంక్షోభం సృష్టించకండి. సరైన పద్ధతిలో క్షేత్రస్థాయికి రండి. ఎన్నికల సంఘం, మీరు ఒక అద్భుతమైన ఆట ఆడారు. బీజేపీకి అవకాశం లేదు. గతంతో పోలిస్తే ఈసారి మాత్రం మీకు సీట్లు తగ్గుతాయి. ఇది పశ్చిమ బెంగాల్ అస్తిత్వ పోరాటం. బెంగాల్ గెలుస్తుంది. ‘‘ఢిల్లీ కా లడ్డూ’’ గెలవదు.’’ అంటూ మమత వ్యాఖ్యానించారు.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతను సువేందు అధికారి ఓడించారు. మరోసారి సువేందు అధికారిని నందిగ్రామ్, భబానీపూర్ నుంచి బీజేపీ బరిలోకి దింపింది. బీజేపీ తొలి జాబితాలో 144 మంది అభ్యర్థులను ప్రకటించింది.
West Bengal | TMC announces names of candidates for 291 assembly seats
Voting for all 294 assembly seats in West Bengal will be held in two phases – on April 23 and 29 – with 152 and 142 seats going to polls, respectively. Counting of votes will take place on May 4. pic.twitter.com/235IbTGpwO
— ANI (@ANI) March 17, 2026
తాజావార్తలు
-
IPL 2026: ఆర్సీబీ vs ముంబై మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్ ఓవర్ యాక్షన్.. బిగ్ షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం!
-
Today Astrology: మే 12 దిన ఫలాలు.. తొందరపాటు నిర్ణయాలు వద్దు.. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
-
Drishyam3 Telugu : దృశ్యం 3 తెలుగు ట్రైలర్ చూశారా.. జార్జికుట్టి పోలీసులకు దొరికేసాడా?
-
Sreesanth touches Yuvraj Feet: యువరాజ్ సింగ్ పాదాలకు నమస్కరించిన శ్రీశాంత్.. వీడియో వైరల్
-
Peddi : స్క్రీన్‌పై రామ్ చరణ్ కనిపించడు.. కేవలం ‘పెద్ది’ మాత్రమే కనిపిస్తాడు: అనంత శ్రీరామ్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?