Physical Abuse On Female Doctor: కేరళలో దారుణం జరిగింది. ఉద్యోగం పేరుతో నమ్మించి మేల్ నర్స్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి మహిళా డాక్టర్ పై అత్యాచారం చేశాడు. ఇంతటితో ఆగకుండా మహిళా డాక్టర్ న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ, చివరకు వాటిని ఆన్ లైన్ లో షేర్ చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: IND vs AUS: మూడో టెస్టులో పీకల్లోతు కష్టాల్లో భారత్.. 163 పరుగులకే ఆలౌట్
కేరళకు చెందిన మహిళా వైద్యురాలిపై త్రిసూర్ కు చెందిన మేల్ నర్స్ గా పనిచేస్తున్న నిషామ్ బాబు అత్యాచారానికి పాల్పడ్డాడు. గతేడాది ఈ ఇద్దరు కర్ణాటకలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. మహిళా డాక్టర్ న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు 24 ఏళ్ల నిషామ్ బాబును పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కోయంబత్తూర్ లోని ఓ ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఓ హోటల్ కు తీసుకెళ్లి డాక్టర్ పై అత్యాచారం చేశాడు. ఆమె నగ్న చిత్రాలను తీసి వాటితో బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
ఆ తరువాత ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించి పదేపదే లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ నేపధ్యంలో అతడి నుంచి తప్పించుకోవడానికి బాధిత మహిళా డాక్టర్, అతడి నెంబర్ ను బ్లాక్ చేసింది. దీంతో ఆమె న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది గమనించిన బాధిత మహిళా పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో నిషామ్ బాబుపై అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.