Maldives: చైనాలో మాల్దీవుల ఒప్పందం.. భారత అధికారులు వెళ్లిపోవాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ మరోసారి భారత్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. మే 10 తర్వాత భారత సైనిక సిబ్బంది, పౌర దుస్తుల్లో ఉన్న వారు కూడా తమ దేశంలో ఉండరాదని హెచ్చరించారు. మాల్దీవుల్లో భారత సైనిక సిబ్బందిని , పౌర సిబ్బంది మాల్దీవులకు చేరుకున్న వారంలోపే ముయిజ్జూ నుంచి ఈ ప్రకటన వచ్చింది. భారత సైనిక సిబ్బంది మాల్దీవుల నుంచి ఉపసంహరించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మార్చి 10 లోగా ఈ ప్రక్రియ మొదటిదశ ప్రారంభించనున్నారు. అయితే, తాజాగా ముయిజ్జూ ఈ తేదీ కన్నా ముందుగానే ప్రకటన చేయడం గమనార్హం.
Read Also: CM Revanth Reddy : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
భారతదేశ సైనికులను తమ దేశం నుంచి బహిష్కరించేందుకు తమ ప్రభుత్వం విజయం సాధించినందుకు, తప్పుడు పుకార్లను వ్యాప్తి చేసే వ్యక్తులు పరిస్థితిని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ముయిజ్జై బా అటోల్ ఎయిదాఫుషి ప్రాంతంలోని ప్రజలను ఉద్దేశించి అన్నట్టుగా అక్కడి మీడియా నివేదించింది. మే 10వ తేదీన భారత సైనికులు ఉండరు, భారత సైన్యం ఈ దేశంలో ఏ దుస్తుల్లో కూడా నివసించదు, ఈ విషయాన్ని తాను విశ్వాసంతో చెబుతున్నానని, చైనాతో ఉచిత సైనిక సహాయ ఒప్పందంపై సంతరం చేసిన ఒక రోజు తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.
గత నెల ప్రారంభంలో ఫిబ్రవరి 2న ఢిల్లీలో ఇరు పక్షాల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత, మాల్దీవుల్లో మూడు విమాన ప్లాట్‌ఫారమ్‌లను నిర్వహిస్తున్న తమ సైనిక సిబ్బందిని మే 10 నాటికి భారత్ భర్తీ చేస్తుందని, మొదటి దశ ప్రక్రియ మార్చి 10 నాటికి పూర్తి చేయాలని మాల్దీవుల విదేశాంగ శాఖ తెలిపింది. అక్కడి ప్రజలకు మానవతా సేవలను అందించేందుకు 88 మంది సైనిక సిబ్బంది మాల్దీవుల్లో ఉన్నారు. భారత వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనాకు దగ్గరవుతున్నాడు. భారత దేశానికి 300 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న మాల్దీవుల్లో చైనా తిష్ట వేయడం భారత్‌కి ప్రమాదకరంగా భావిస్తోంది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!