Maharashtra Political Crisis: అధికారం చేపట్టాలంటే ఎంత మెజారిటీ కావాలి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడే దేశవ్యాప్తం ప్రజలు మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారు. తాజాగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. సభ్యులు వారివారి సీట్లలో కూర్చున్న తరువాత ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఏ కారణం చేతనైనా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయడం కుదరదు. మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని ఆదేశించారు. జూన్ 30న ఫ్లోర్ టెస్ట్ ఉండటంతో అసెంబ్లీ లోపల, బయట భారీ బందోబస్త్ ఏర్పాటు చేయనున్నారు.
మహారాష్ట్రలో పార్టీ బలబలాలు:
Also Read
- CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
- Abhijeet Dipke: వాంగ్‌చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
- Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
- Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
అసెంబ్లీలో మొత్తం స్థానాలు: 288
మ్యాజిక్ ఫిగర్: 144
మహా వికాస్ అఘాడీ కూటమి:
శివసేన( ఉద్ధవ్ వర్గం): 16
ఎన్సీపీ: 53
కాంగ్రెస్: 44
బీజేపీ కూటమి:
బీజేపీ: 106
ఎంహెచ్ జేపీఎస్: 02
స్వతంత్రులు: 05
శివసేన( షిండేవర్గం): 39+07(స్వతంత్రులు)
ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేయని వరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ మహావికాస్ అఘాడీ కూటమి(ఎంవీఏ)కి 169 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండేది. అయితే ఏక్ నాథ్ షిండే దాదాపు 39 మంది శివసేన ఎమ్మెల్యేలతో పాటు 07 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నాడు. దీంతో ఎంవీఏ కూటమి మైనారిటీలో పడింది.
ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ప్రస్తుతం బీజేపీకి 106 ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, స్వతంత్రులు కలుపుకుని 113 మంది మద్దతు ఉంది. ఏక్ నాథ్ షిండే వర్గంలోని 39 మంది, స్వతంత్ర ఎమ్మెల్యేలు 07 మందిని మంది కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ 144 మార్క్ దాటుతోంది. దీంతో అధికారం బీజేపీ చేజిక్కించుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
UK: లండన్‌లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
-
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
-
CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
-
Mani Ratnam: సెట్స్‌పైకి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒకే ఫ్రేమ్‌లో సాయి పల్లవి-విజయ్ సేతుపతి!
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!